Taapsee Pannu : ఆ హీరోయిన్‌కు ఈగో టన్నుల్లో ఉందట.. కాస్త జాగ్రత్త సుమీ..!



Taapsee Pannu .. ఈ సొట్టబుగ్గల చిన్నది టాలీవుడ్‌లో ఝుమ్మందినాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అడపాదడపా తెలుగు సినిమాలు చేసింది. ఇక తెలుగు వాళ్లకు నడుము చూపించడం తప్ప హీరోయిన్ల టాలెంట్‌ను ఎలా వాడుకోవాలో తెలియదంటూ సంచలన కామెంట్లు చేసి బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. ఇక బీ టౌన్‌లోనే పాగా వేసి ఇప్పుడు నంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగింది.

Taapsee Pannu
Taapsee Pannu

తాప్సీ ఓ సినిమా సైన్ చేయాలంటే ఈ సినిమాలో ఆమెది కీలక పాత్ర అయి ఉండాలి. ఆ పాత్రకు చాలా వెయిట్ ఉండాలి. అలాంటిలాంటి పాత్రలకు తాప్సీ సై అనదు. అందులో డెప్త్ ఉండాలి.. అది తనకు ఛాలెంజింగ్‌గా అనిపించాలి. నాలుగు పాటలు పాడి.. రెండు స్టెప్పులేసి పోయే రకం కాదు తాప్సీ. పాత్ర కోసం ఎంత కష్టమైనా పడి స్వభావం కలిగిన హీరోయిన్. అందుకే ఈ బ్యూటీకి హీరోయిన్ సెంట్రిక్ స్టోరీలే ఎక్కువగా వస్తున్నాయి.

సాధారణంగా ఏ హీరోయిన్‌కు అయినా హీరోయిన్ సెంట్రిక్ పాత్రలు పోషించాలని ఉంటుంది. కానీ అందరికీ ఆ ఛాన్స్ రాదు. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం దాదాపు అలాంటి క్యారెక్టర్లే ఆఫర్లుగా వస్తున్నాయి. తాప్సీ ఏ సినిమా తీసినా అందులో కంటెంట్ ఉంటుంది. అది కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది అనే స్థాయికి ఎదిగింది. అయితే తాప్సీకి చాలా ఈగో ఉందట.

మనిషన్నాక..కూసింత కళాపోషణ ఉండాలోయ్ అన్నట్లు…మనిషి అన్న వాడికి ఎవడికైనా ఈగో కూడా కూసింత ఉండాలోయ్. కానీ ఈగో మరీ ఎక్కువైతే లోకానికి లోకువై పోతాం. కానీ తాప్సీకి మాత్రం ఈగో గ్రాముల్లో కాదు.. కిల్లోలోనూ కాదు..ఏకంగా టన్నుల్లోనే ఉందట. ఈ బ్యూటీ ఈగోకి పోయిందంటే? ఎంత దూరమైనా వెళ్తుందట. దాని అంతు చూసే వరకూ వదిలి పెట్టదట.  కానీ తనలో ఈగోని పొగొట్టేది మాత్రం తన మనసుకు నచ్చిన స్క్రిప్ట్ అట. తన మనసుకు నచ్చిన కథ దొరికితే మాత్రం తన ఈగోని పక్కనబెట్టి ఆ డైరెక్టర్‌కు సాష్టాంగ నమస్కారం పెట్టేస్తుందట.

అలాంటి విషయంలో తాప్సీ తన ఈగోని చూపించదట.  పాత్ర ఎలా ఉంటుంది? బడ్జెట్ ఎంత?  బ్యానర్ ఏంటి ? వంటి అంశాలు అస్సలు ఆలోచించదట. కంటెంట్ నచ్చితే చాలు ఆ సినిమాకు ఓకే చెప్పేసి బుద్ధిగా డైరెక్టర్ హీరోయిన్‌గా మారిపోతుందట. తన కెరీర్ గురించి ఎవరెలాంటి విమర్శలు చేసినా లైట్ తీసుకుంటుందట ఆ సమయంలో.  ఒక మంచి సినిమా చేయాలన్న ఉద్దేశం తప్ప ఇంకెలాంటివి తన కంటికి ఆ టైంలో ఇంకేం కనిపించవట.

‘సినిమా కెరీర్ ఎవరికి పూల దారి కాదు.. అందరూ తప్పులు చేస్తారు. ఆ తప్పుల నుంచే చాలా నేర్చుకుంటారు. ఏ పని చేసినా వంద శాతం ఎవరిని తృప్తి పరచలేం. అందుకే ప్రతి విమర్శ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా విమర్శలను కేర్ చేయకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటే ఈగోయిస్టిక్ అంటే నేనేం చేయలేను. అలాంటివి అసలు నా చెవికి కూడా ఎక్కించుకోను’ అని చెప్పుకొచ్చింది ఈ దిల్లీ డాల్.

Tags: