Veera Simha Reddy : వీర సింహా రెడ్డి ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ లాక్ ?

- Advertisement -

Veera Simha Reddy : సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి బాక్సఫీసును షేక్ చేసిన బాలయ్య భారీ సక్సెస్ ను అందుకున్న సినిమా వీర సింహా రెడ్డి.. కలెక్షన్ల సునామి సృష్టించింది… సినిమా వచ్చి నెల అవుతున్నా కూడా కలెక్షన్ల జోరు పెరుగుతుంది.. ఇప్పుడు ఈ సినిమా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇప్పుడు తన వేట రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించ బోతున్నాడు. ఈ మేరకు డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ఓ ట్వీట్‌ చేసింది. ఇప్పటికే అర్థమైపోయుంటుంది.. ఆ ట్వీట్ ఏంటంటే.. ఈ సినిమా త్వరలోనే ఓటిటీలో రానుంది.. అది ఎప్పుడు, ఎక్కడ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Veera Simha Reddy
Veera Simha Reddy

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేనిల ‘వీర సింహా రెడ్డి’ స్ట్రీమింగ్‌ డేట్‌ను డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ అనౌన్స్‌ చేసింది. దీంతో అభిమానులు మరోసారి తమ సత్తా చాటడానికి రెడీ అయిపోతున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం ‘వీర సింహా రెడ్డి’. శ్రుతి హాసన్‌, హనీ రోజ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చిన విషయం తెలిసిందే. రూ. వంద కోట్లకుపైగా వసూళ్లతో అదరగొట్టిన ఈ సినిమాను ఇప్పుడు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ మేరకు టీమ్‌ అనౌన్స్‌ చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్‌ హక్కుల్ని హాట్‌స్టార్‌ కైవసం చేసుకుందని ఎప్పుడో తెలిసినా కూడా ఇప్పుడు డేట్ ను చెప్పేశారు..

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna

నందమూరి బాలయ్య గత బ్లాక్‌బస్టర్‌ ‘అఖండ’ ఇదే ఓటీటీలో వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు ఆ రోజుల్లో భారీ స్ట్రీమింగ్‌ వచ్చింది. రికార్డు స్థాయిలో ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీలో వీక్షించారు. ఆ సినిమాకొచ్చిన అప్లాజ్‌ను మరోసారి క్యాష్ చేసుకునేలా హాట్‌స్టార్‌ టీమ్‌.. ప్రచారం చేస్తోంది. ‘వీర సింహా రెడ్డి’ సినిమా స్ట్రీమింగ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేయడానికి.. ‘అఖండ’ సినిమాను వాడుకున్నారు. అప్పుడు ‘అఖండ’.. ఇప్పుడు ‘వీర సింహా రెడ్డి’ సినిమాను ప్రచారం జరుగుతుంది..

- Advertisement -
veera narasimha reddy
Ballaya

తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్దమయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ వేదికగా ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది.సీమ సింహం వేట షురూ. ఫిబ్రవరి 23న సాయంత్రం 6 గంటల నుంచి ‘వీర సింహారెడ్డి‘ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. రెడీ నా?’ అని హాట్‌స్టార్ ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం వాల్తేరు వీరయ్య ఈ నెల 28న (నెట్‌ఫ్లిక్స్‌) ఓటీటీలోకి అడుగుపెడుతున్నది. కాగా.. అంతకంటే ఐదు రోజుల ముందే బాలయ్య హాట్‌స్టార్‌లో సందడి చేయనున్నాడు.. ఇప్పుడు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా ఉన్నాడు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here