Veera Simha Reddy : నాకింకా కసి తీరలేదు.. తప్పకుండా ఆ సినిమా చేస్తా.. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య

- Advertisement -

 Veera Simha Reddy : నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రుతిహాసన్ జంటగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్టైనర్ ‘వీరసింహారెడ్డి’. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో బాలయ్య ఊరమాస్ అవతార్.. పవర్ డైలాగ్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఒంగోలులోని అర్జున్‌ ఇన్‌ఫ్రా మైదానంలో ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించింది. భారీ సంఖ్యలో అభిమానులు హాజరై సందడి చేశారు.

Veera Simha Reddy
Veera Simha Reddy

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య స్పీచ్ అదిరిపోయింది. సినిమాలు, పాలిటిక్స్ గురించి.. ఆ రంగాల్లో తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి బాలయ్య క్లారిటీ ఇచ్చారు. స్పీచ్ లోనూ తన పవర్ డైలాగ్స్ యూజ్ చేసి ఫ్యాన్స్ ను ఖుష్ చేశారు. 

Veerasimha reddy event
Veerasimha reddy event

‘‘నాకు జన్మనిచ్చి, మీ అందరి గుండెల్లో నిలిపినందుకు నా తండ్రి ఎన్టీఆర్‌కు ధన్యవాదాలు. నటనలో ఆయన ప్రయోగాల దిట్ట. అలాంటి నటుడు మరొకరు లేరన్న విషయాన్ని నేనే కాదు ప్రతి నటుడూ అంగీకరించక తప్పదు. ఆయన సినిమాలతో కళామ తల్లి పండుగ చేసుకుంది. ఈ వేడుకతో ఈ రోజు నుంచే సంక్రాంతి సందడి మొదలైంది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ వేడుకకు అందాన్ని, పెద్దరికాన్ని తీసుకొచ్చేది దర్శకుడు బి. గోపాల్‌గారనే అనుకుని ఆయన్ను ఆహ్వానించాం. నటులు, టెక్నిషియన్ల నుంచి ప్రతిభను వెలికితీయగల సత్తా ఉన్న ఒంగోలు గిత్త మన గోపీచంద్‌ మలినేని. ఈయనే కాదు నా తదుపరి చిత్రం దర్శకుడు అనిల్‌ రావిపూడిది ఒంగోలే. నేనెప్పుడూ రాయలసీమకే పరిమితమవుతానని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, అది నిజం కాదు’’ అని బాలయ్య బాబు అన్నారు. 

- Advertisement -

‘‘మానవారణ్యంలో కల్మషం, కుతంత్రాలను వేటాడే సింహరాజు నేనే. రెడ్డిని నేనే, నాయుడిని నేనే. అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణని. ఎన్నో రకాల సినిమాలు చేసినా నాకు ఇంకా కసి తీరలేదు. భిన్నమైన పాత్రలు పోషించడం, బాధ్యతలు నిర్వహించడంలోనే తృప్తి. ‘ఇక బాలకృష్ణ సినిమాలు, రాజకీయాలకే పరిమితం’ అని అనుకునే వారికి సమాధానం ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమం. టాక్‌ షోలలో అది నంబరు 1గా నిలిచింది. అలానే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రాల్లో ‘వీరసింహారెడ్డి’ ఒకటి. నటీనటులు, సాంకేతిక నిపుణులు కష్టపడి పనిచేశారు. దునియా విజయ్‌ కన్నడ చిత్ర పరిశ్రమ హీరో అయినా ఈ సినిమాలో విలన్‌ నటించడం గొప్ప విషయం. సప్తగిరి నుంచి నేను కామెడీ టైమింగ్‌ నేర్చుకోవాలి. తమన్‌ సంగీతం అందించిన పాటలు ఎలా ఉన్నాయో చూశారు. థియేటర్లలో.. రీ రికార్డింగ్‌కు మళ్లీ ఎన్ని సౌండ్‌ బాక్సులు బద్దలవుతాయో చూస్తారు. సాయి మాధవ్‌ బుర్రా రాసిన మాటలు పేలతాయి. అద్భుతమైన సినిమా ఇది. బాగా ఆడి తీరుతుంది’  అని బాలకృష్ణ అన్నారు.

 ‘‘గోపీచంద్‌ దర్శకత్వంలో నేను నటించిన మూడో సినిమా ఇది. ఆయన్ను నేను అన్నయ్యగా భావిస్తా. బాలకృష్ణగారు పాజిటివ్‌ పర్సన్‌. ఎంతో ఉత్సాహంగా ఉంటారు’’ అని శ్రుతిహాసన్‌ చెప్పింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here