Varun Tej : ఆఖరికి పెళ్లికి కూడా చిరంజీవి పేరును వాడుకుంటున్న వరుణ్ తేజ్.. నాగబాబును పక్కన పెట్టి మరీ..

- Advertisement -

Varun Tej తాజాగా తన వెడ్డింగ్ కార్డ్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం వరుణ్, లావణ్య వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ గా మారింది. డీటెయిల్స్ లోకి వెళ్తే.. మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. నాగబాబు కొడుకు మెగా హీరో వరుణ్ తేజ్ తన ప్రేయసి లావణ్య త్రిపాఠి ని నవంబర్ 1న వివాహం చేసుకోబోతున్నాడు. ‘మిస్టర్’ మూవీ షూటింగ్ టైంలో వరుణ్, లావణ్య మొదట కలుసుకుంది ఇటలీలోనే కావడంతో సెంటిమెంట్ గా మ్యారేజ్ వెన్యుని అక్కడే సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికే బ్యాచిలర్ పార్టీలు పూర్తయ్యాయి. ఈ పార్టీలో మెగా హీరోలంతా తెగ సందడి చేశారు.

Varun Tej
Varun Tej

పెళ్లి పనులు కూడా చక చకా జరుగుతున్నాయి. పెళ్లి ఇటలీలో కావడంతో మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ అక్కడికి వెళ్ళనున్నారు. వీటితోపాటు మరి కొంతమంది బంధువులు, స్నేహితులు ఇటలీకి వెళ్తారు. పెళ్లి ఇటలీలో చేసుకుంటున్న వరుణ్ తేజ్ రిసెప్షన్ ని మాత్రం హైదరాబాదులోనే ప్లాన్ చేశాడు. అందుకే పూర్తిస్థాయిలో అతిధులను హైదరాబాదులో జరిగే రిసెప్షన్ కి ఇన్వైట్ చేస్తున్నారు. తాజాగా ఇన్విటేషన్ కార్డుకు సంబంధించి ఓ వీడియోని వరుణ్ తేజ్ తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. చూడడానికి చాలా రిచ్ గా ఆకర్షణీయంగా ఉన్న ఈ రిసెప్షన్ ఇన్విటేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శుభలేఖ ముందు భాగంలో వరుణ్, లావణ్య పేర్లలోని VL అక్షరాలతో లోగోని డిజైన్ చేశారు.

Varun Tej  Lavanya Marriage

లోపల పై భాగంలో వరుణ్ తేజ్ నానమ్మ అంజనాదేవి, తాతయ్య కొణిదెల వెంకటరావు ఆశీస్సులతో.. అని ముద్రించి ఉంది. ఆ తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్.. అంటూ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేర్లను హైలైట్ చేయడం విశేషం. కాగా రిసెప్షన్ ఇన్విటేషన్ లో గెస్ట్ లకు అవసరమైన కార్ పాస్ లను కూడా పొందుపరిచారు. వరుణ్, లావణ్య పెళ్లి దగ్గర పడడంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వరుణ్ లవ్ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here