Pawan Kalyan తన కెరీర్ లోనే అత్యంత వేగంగా పూర్తి చేసిన సినిమా ఏదైనా ఉందా అంటే అది #PKSDT సినిమా అనే చెప్పాలి.ప్రముఖ దర్శకుడు/నటుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది.ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ ప్రాణమిత్రుడు మరియు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించాడు.తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా సీతం’ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.
ఇందులో పవన్ కళ్యాణ్ కాలానికి దేవుడిగా కనిపించబోతున్నాడు.ఆయన పాత్ర ని ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే ఎలివేషన్స్ తో స్క్రిప్ట్ ని నింపేసాడట త్రివిక్రమ్ శ్రీనివాస్.అంతే కాదు పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఒక అదిరిపొయ్యే సాంగ్ కూడా ఉంటుందట, ఇలా ఆద్యంతం పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే విధంగానే ఉంటుందట ఈ చిత్రం.
అయితే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ని ఉగాది కానుకగా విడుదల చేస్తారని ఫ్యాన్స్ ఆశించారు.కానీ అది జరుగలేదు,పవన్ కళ్యాణ్ కొద్దిరోజులు ఆగమని చెప్పడం తో ఆపేశారట.రీసెంట్ గానే త్రివిక్రమ్ ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ కి ఖరారు చేసి పవన్ కళ్యాణ్ కి చెప్పాడని, ఆయన ఆ టైటిల్ ని చూసి వెంటనే ప్రొసీడ్ అవ్వమని చెప్పాడంటూ సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి.ఆ టైటిల్ ఏమిటంటే ‘నేనే కాలాన్ని’ అని అంటున్నారు.
గతం లో ఈ సినిమాకి టైటిల్ గా ‘దేవరా’ అని ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపించాయి.కానీ ఆ టైటిల్ వేరే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించుకున్నారు.దీంతో ‘నేనే కాలాన్ని’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.ఏప్రిల్ 8 వ తారీఖున అకిరా నందన్ పుట్టినరోజు సందగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది.