Pawan kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. షూటింగ్స్ బంద్.. కారణం అదేనా?

- Advertisement -

Pawan kalyan : సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉంటాడో మనకు తెలుసు.. అతి తక్కువ కాలంలోనే సినిమాలను పూర్తి చేస్తూ.. రాజకీయాల్లో బిజీగా ఉంటాడు..నిన్నమొన్నటి వరకు షూటింగ్స్ లో ఊపిరి సలపనంతా బిజీ గా గడిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన కుటుంబం తో కలిసి విదేశాలకు చిన్న హాలిడే ట్రిప్ కోసం వెళ్ళాడు. ఈరోజు ఆయన విమానాశ్రయం లో తన భార్య పిల్లలతో కలిసి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ బుడి బుడి అడుగులతో పరుగులు తీస్తూ వెళ్లడాన్ని చూసిన అభిమానులు పవన్ లెజనోవా కొడుకు అప్పుడే ఇంత పెరిగాడా అని ఆశ్చర్యపోతున్నారు. నాలుగు రోజుల పాటు ఈ హాలిడే ట్రిప్ ఉండనుంది అని తెలుస్తుంది..

Pawan kalyan
Pawan kalyan

పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్నా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు.. మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఇండియాకు వస్తాడని తెలుస్తుంది.. ఆ వచ్చిన వెంటనే ఆయన హరీష్ శంకర్ తెరకెక్కించబోయ్యే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘గబ్బర్ సింగ్’ అనే సినిమా వచ్చింది. ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.అప్పట్లో ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని తిరగరాసి, అల్ టైం టాప్ 2 గ్రాస్సర్ గా నిల్చింది.మళ్ళీ అలాంటి కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అంచనాలు రోజూ రోజుకు పెరుగుతున్నాయనడం లో సందేహం లేదు..

ఏప్రిల్ 5 నుండి పది రోజులు విరామం లేకుండా కొనసాగనున్న ఈ మొదటి షెడ్యూల్ పూర్తైన వెంటనే హరి హర వీరమల్లు బ్యాలన్స్ షూటింగ్ ని పూర్తి చేయనున్నాడు. మళ్ళీ మే నెల నుండి OG మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు పవన్ కళ్యాణ్.ఇలా ఇండియా కి తిరిగి వచ్చిన తర్వాత అస్సలు బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ లో పాల్గొనున్నారు.. ఇది ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.. త్వరలోనే సినిమాలు ఒక్కొక్కటి రిలీజ్ అవుతాయని అనుకున్నారు.. ఇప్పుడు పవన్ గ్యాప్ తీసుకోవడంతో సినిమాల రిలీజ్ డేట్ వెనక్కి వెళ్ళుతుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.. మరోవైపు ఎన్నికల్లో గెలవాలని జోరుగా ప్రచారాలు చేస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here