Cash Programme : అమ్మ బాబోయ్.. పచ్చి బూతులు.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో..

- Advertisement -

యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న క్యాష్ షో Cash Programme గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..ఎందుకంటే వల్గర్ మీనింగ్స్ ఉండవు ..డబల్ మీనింగ్ డైలాగ్స్ అంతకన్నా వాడదు.. చాలా నేచురాలిటీ గా హెల్తి కామెడీతో .. ప్రతి శనివారం రాత్రి ఈటీవీ లో ప్రసారం అవుతుంది.. ఎన్నో తెలియని విషయాల గురించి చెప్పడంతో పాటు బాగా సరదాగా ఉంటుంది. అందుకే ఈ షో కు మంచి రేటింగ్ కూడా వుంది..అందరిని నవ్విస్తూ ఉంటుంది . అందుకే ఆమె షోలను ఫ్యామిలీ మొత్తం చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు.

అయితే రాను రాను ఈ మధ్యకాలంలో సుమ షో ల లో కూడా వల్గారిటీ ఎక్కువైపోతుంది. డబల్ మీనింగ్ డైలాగ్స్ తో వినడానికి కంపరంగా ఉండే జోక్స్ వేస్తున్నారు. రీసెంట్ గా అలాంటి ఎపిసోడ్ క్యాష్ ప్రోగ్రాంలో జనాలు చూసి మండిపడుతున్నారు..ఈ వారం ప్రసారం కానున్న షో ప్రోమో ను చూసి జనాలు షో పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు..

- Advertisement -
cash programme
cash programme

ఈ వారం క్యష్ ప్రోగ్రాం కి జ్యోతి, కరాటే కళ్యాణి, పృధ్వీ రాజ్, కృష్ణ భగవాన్ వచ్చారు. ఈ క్రమంలోని షోలో కామెడీ పీక్స్ గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన జనాలకు చెవులో ఫ్లవర్ పెట్టారు. కామెడీ అయితే ఉండింది కానీ అది మొత్తం అడల్ట్ కామెడీనే.. వల్గర్ , డబల్ మీనింగ్ డైలాగ్స్ లతో ప్రోమో మొదల నుంచి ఎండింగ్ వరకు ప్రతి డైలాగుల్లో డబుల్ మీనింగ్ మాటలను క్లియర్గా అర్థం చేసుకునే విధంగా మాట్లాడారు కమెడియన్స్. మరీ ముఖ్యంగా వీళ్ళు వేసిన ఆడియో ఫంక్షన్ స్కిట్ లో పచ్చి బూతు పదాలు మాట్లాడడం షో ని చూసిన జనాలు తిట్టేలా చేసుకున్నారు .

ఆడియో ఫంక్షన్ స్కిట్ లో కరాటే కళ్యాణి భారీ చెత్త డైలాగులతో రెచ్చిపోయారు .ఈ చిత్ర షూటింగ్ కోసం హిమాలయాలకు వెళ్ళాం ..అక్కడ హీరో పృద్వి చలికి తట్టుకోలేకపోయాడు ..అందుకే తోడుగా ఇద్దరు హీరోయిన్ ఇచ్చామని చెప్పడం. చాలా వల్గారిటీ గా అనిపించింది. అంతేకాదు ఆయన చలికి కూడా తట్టుకోలేకపోయాడు అని నవ్వులు పూయించినా.. దానిలో ఉన్న మర్మం అందరికీ తెలిసిందే .ఇక తర్వాత కరాటే కళ్యాణి కూడా హద్దులు మీరి డబల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడింది. ఈ సినిమా కోసం అంతా సమర్పించేసుకున్నాను అంటూ డబల్ మీనింగ్ డైలాగ్ వచ్చేలా మాట్లాడింది..ఇది వినడానికి ఎబ్బేట్టుగా ఉండటంతో అందరు తిట్టి పోస్తున్నారు.

పృధ్విరాజ్ ని చూపిస్తూ అమ్మ దీనమ్మ బత్తాయో.. ఈ బత్తాయి మాత్రం పిండేసాడుగా అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న సుమ షాక్ అయింది . నోటి వెంట మాట రాకుండా సైలెంట్ గా ఆగిపోయింది . ఆ మాటలు ఎంత పెద్ద బూతు పదం ఉందో అందరికీ తెలిసిందే . చిన్న పిల్లల సైతం చూస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ ఇలాంటి బూతు పదాలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ మండి పడుతున్నారు జనాలు. చూడాలి మరి పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక ఇంకెన్ని బీప్ సౌండ్ వేసుకుని ఇంకెన్ని ఆ పదాలను వాడారో..ఏది ఏమైనా ఈ ప్రోమో దుమారం రేపుతుంది.. సమాజానికి ఇలాంటి షో వల్ల ఏం ఉపయోగం అంటూ జనాలు మండిపడుతున్నట్లు తెలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here