valentain’s day Special : ఒకేసారి ముగ్గురు హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపిన స్టార్స్ వీళ్లేనా!

- Advertisement -

Valentain’s Day Special : సినీ ఇండస్ట్రీ లో ఒక హీరో హీరోయిన్ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం అనేది సర్వసాధారణం.కొన్ని జంటలు ఎంతో సాఫీగా తమ దాంపత్య జీవితాలు గడుపుతుండగా, మరికొంతమంది కొన్ని విభేదాల కారణం గా విడిపోవాల్సి వచ్చింది. అందుకే ఉదాహరణ గా ఈమధ్యనే విడాకులు తీసుకున్న సమంత మరియు నాగ చైతన్య జంట కావొచ్చు, పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ జంట కావొచ్చు ఇలా ఎన్నో ఉన్నాయి.

valentain's day Special
valentain’s day Special

వాళ్ళ మధ్య విడాకులు అయితే జరిగింది కానీ , ఎందుకు జరిగిందనే విషయం మాత్రం వాళ్లకి తప్ప ఎవరికీ తెలియవు.అయితే కొంత మంది హీరోలు మాత్రం ఒకేసారి ఇద్దరినీ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వారిలో సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ ఒకడు.సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టకముందే ఇందిరా దేవి గారిని పెళ్లాడిన కృష్ణ ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత తనతో కలిసి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన విజయ నిర్మల గారిని పెళ్లాడాడు.

విజయ నిర్మల గారిని పెళ్లాడినప్పటికీ ఇందిరా దేవి కి విడాకులు ఇవ్వలేదు కృష్ణ.. ఇద్దరినీ సమానంగా చూసుకుంటూ వచ్చాడు. వాళ్ళిద్దరితో చివరి రోజులు వరకు కృష్ణ తన దాంపత్య జీవితం గడిపాడు. బహుశా ఇండియా లో ఏ ప్రముఖుడు కూడా ఇలాంటి జీవితం గడిపి ఉండరు అనే చెప్పొచ్చు.

- Advertisement -
kamal haasan

కానీ ఆ తర్వాతి తరం హీరోలు మాత్రం కేవలం హీరోయిన్స్ తో డేటింగ్స్ మాత్రమే చేసారు, వారిలో ప్రముఖంగా కమల్ హాస్సన్ పేరు చెప్పొచ్చు. మొదట్లో ఈయన వాణీ గణపతి అనే అమ్మాయిని పెళ్లాడాడు, ఆ తర్వాత వీళ్ళ మధ్య కొన్ని విభేదాలు రావడం తో విడిపోయి తన తోటి హీరోయిన్ అయినా శారికా ని పెళ్లాడాడు. వీళ్లిద్దరికీ జన్మించిన బిడ్డనే శృతి హాసన్. అయితే ఈమెతో దాంపత్య జీవితం కొనసాగుతూనే ప్రముఖ హీరోయిన్ సిమ్రాన్ తో ప్రేమాయణం నడిపి కొంతకాలం డేటింగ్ చేసాడు కమల్ హాసన్. ఇది అప్పట్లో కోలీవుడ్ లో పెను దుమారమే రేపింది.

ఈ విషయం తెలుసుకున్న శారికా కమల్ హాసన్ తో గొడవలుపడి కొంతకాలానికి విడిపోయింది. ఆ తర్వాత కమల్ హాసన్ గౌతమీ అనే హీరోయిన్ తో కూడా ప్రేమాయణం నడిపాడు, కానీ పెళ్లి కాలేదు.. ప్రస్తుతం ఆయన పూజా కుమార్ అనే హీరోయిన్ తో చాలా కాలం నుండి డేటింగ్ చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

siddharatha

ఇక ఇలాగే కాంట్రవర్సీ లతో నిండిపోయిన మరో హీరో సిద్దార్థ్. ఇతను ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లోనే ఒక అమ్మాయిని పెళ్లాడాడు, ఒక కొడుకు కూడా ఉన్నాడు.. కానీ కొన్ని విబేధాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది, ఆ తర్వాత సమంత తో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపి పెళ్లి దాకా వెళ్ళాడు.. కానీ ఎందుకో మధ్యలో వీళ్ళ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ప్రముఖ హీరోయిన్ అదితి రావు హయాద్రి తో డేటింగ్ లో ఉన్నాడు.

nayathara

ఇక హీరోయిన్స్ లో నయనతార కూడా గతం లో చాలా ప్రేమాయణాలు నడిపింది.ముందుగా శింబు తో కొంతకాలం లవ్ ట్రాక్ నడిపింది,ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య విభేదాలు రావడం తో విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రభుదేవా తో పెళ్లి దాదాపుగా ఖరారు అని అనుకుంటున్న సమయం లో అది కూడా క్యాన్సిల్ అయ్యింది. చివరికి సతీష్ విగ్నేష్ అనే స్టార్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకుంది.

ఇదే కోవలో రష్మిక , మెహ్రీన్ పిర్జాడా వంటి వారు కూడా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే వస్తుంది. ఒక రోజు సరిపోదు. అలా సినీ ఇండస్ట్రీ లో పెళ్ళై సుఖం గా ఉన్న వారికంటే ఎక్కువగా విడిపోయిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళు ప్రేమ కంటే లివింగ్ రిలేషన్ షిప్ కి ఎక్కువ విలువ ఇస్తారు. వర్కౌట్ అయితే జీవితాంతం ఉంటారు. లేదంటే మధ్యలోనే విడిపోతారు. సినిమా కల్చర్ ప్రస్తుతం ఇలాగే నడుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com