Rashmika: రష్మిక నీ సోకుల సోయగం తో మాయ చేయకు ప్లీజ్.. ఉక్కిరి బిక్కిరవుతున్న కుర్రకారు..

- Advertisement -

Rashmika : కన్నడ సోయగం రష్మిక మందన తారపథంలో దూసుకుపోతోంది .. దక్షిణాదితో పాటు హిందీలో కూడా ఈ భామ జోరు చూపిస్తుంది. పుష్ప సినిమా విజయంతో రష్మిక మందన్న జాతీయస్థాయిలో పాపులర్ అయింది. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే బిజీగా ఉన్నా కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు జోరు కొనసాగుతూనే ఉంది.. లేటెస్ట్ గా ఓ పిక్ ను విడుదల చేయగా.. రష్మిక మందన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

Rashmika mandanna
Rashmika mandanna

రష్మిక నవ్విస్తూనే గుండె బరువెక్కించే స్టిల్ ఇచ్చింది. రష్మిక తాపీగా చైర్ లో కూర్చుని.. కళ్ళకి గూగుల్స్.. తలపైన టోపీ.. బిస్కెట్ కలర్ షర్ట్ వేసుకుని బటన్స్ తీసేసి క్యూట్ గా నవ్వుతూ ఒక ఫోజ్ ఇచ్చింది.. అంతే ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. కన్నడ సోయగానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..

Rashmika mandanna
Rashmika mandanna

రష్మిక మందన తన సొంత ఊరు కూర్గ్ తో పాటు హైదరాబాద్ , ముంబై, గోవా, బెంగళూరులో విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేసిందని ఇటీవల సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై రష్మిక మందన స్పందించింది. ఇలాంటి వార్తలు వినడానికి చాలా బాగుంటాయి.. ఆ ఊహలన్నీ నిజమైతేనే బాగుండునని నేను కోరుకుంటున్నా.. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలన్నీ ఎవరో సరదాగా సృష్టించినవి కావచ్చు.. వాటిలో ఏమాత్రం నిజం లేదని రష్మిక మందన తెలిపింది.

- Advertisement -

ఈ కన్నడ సొగసరి పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు హిందీలో యానిమల్ సినిమాలో కథానాయకగా నటిస్తోంది. వాటితో పాటు మరికొన్ని సినిమా ఆఫర్స్ కూడా ఉన్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here