బిగ్ బాస్ 7 లోకి ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

- Advertisement -

తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ షోస్ లో కింగ్ గా పిలవబడే ఈ రియాలిటీ షో ఆరు సీజన్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇప్పుడు 7 వ సీజన్ లోకి అడుగు పెట్టబోతోంది. ఈ సీజన్ అతి త్వరలోనే స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ కాబోతుంది.

వైష్ణవి చైతన్య
వైష్ణవి చైతన్య

ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన రెండు ప్రోమోలను విడుదల చేసారు, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి ఇది వరకు సోషల్ మీడియా లో పలువురు పేర్లు బాగా ప్రచారం అయ్యాయి. ఇది ఇలా ఉండగా లేటెస్ట్ గా ఈ సీజన్ కి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం అవుతూ హల్చల్ చేస్తుంది.

అదేమిటంటే బిగ్ బాస్ యాజమాన్యం కొంత కాలం క్రితమే, ‘బేబీ’ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ని బిగ్ బాస్ లోకి ఆహ్వానించింది అట. ప్రతీ సీజన్ లో ఒక ప్రముఖ యూట్యూబర్ ని బిగ్ బాస్ లోకి ఆహ్వానించే సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో యూట్యూబర్ క్వాటా లో వైష్ణవి కి ఛాన్స్ దక్కింది. ఆమె ఈ షో లో నటించడానికి ఒప్పుకుంది కానీ, ఇప్పుడు బేబీ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, ఆమెకి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టే ఛాన్స్ లేకుండా చేసింది.

- Advertisement -

ఇప్పుడు వైష్ణవి చైతన్య టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా అవతరించింది. ఈ ఊపు లో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేకపోతుంది. అంతే కాదు, ఈమెకి బిగ్ బాస్ టీం రెండు కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తుందట ఇప్పటికీ, మరి వైష్ణవి ఈ ఆఫర్ ని ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here