Vaishnavi Chaitanya : చేసుకుంటే అతడినే పెళ్లి చేసుకుంటా అంటూ ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య షాకింగ్ కామెంట్స్

vaishnavi


Vaishnavi Chaitanya : నిన్న మొన్నటి వరకు కేవలం యూట్యూబ్ ఆడియన్స్ కి మాత్రమే పరిమితమైన వైష్ణవి చైతన్య, ఇప్పుడు ‘బేబీ’ సినిమాతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో వైష్ణవి నట విశ్వరూపాన్ని చూసిన ప్రేక్షకులు ఎవరీ అమ్మాయి, ఇంత అందంగా ఉంది, ఇంత అద్భుతంగా నటిస్తుంది. ఇన్ని రోజులు అసలు ఎక్కడ ఉంది అని ఆమె గురించి వెతకడం మొదలు పెట్టారు.

Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya

అలా వెతికిన తర్వాత యూట్యూబ్ లో ఆమె చేసిన షార్ట్ ఫిలిమ్స్ మరియు వీడియోస్ చూసి ప్రేక్షకులు ఫ్యాన్స్ అయిపోయారు. ముఖ్యంగా ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి ఈమె చేసిన ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ సిరీస్ చూస్తే ఎవరైనా ఫ్యాన్స్ అయ్యిపోవాల్సిందే. అంత చక్కగా నటించింది ఈ తెలంగాణ అమ్మాయి. ఇప్పుడు ఆమె టాలెంట్ ఎలాంటిదో ప్రపంచం మొత్తం చూసింది, ఇక ఆమె కరీర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Vaishnavi Chaitanya Photos

ఇదంతా పక్కన పెడితే గతం లో వైష్ణవి చైతన్య షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అప్పుడు ఆయన వైష్ణవి ని ఒక ప్రశ్న అడుగుతూ ‘నీకు ఎలాంటి డ్రీం బాయ్ కావలి అని కోరుకుంటున్నావు..?. మహేష్ బాబు రేంజ్ లో ఉండాలనుకుంటున్నావా?’ అని అడుగుతాడు. దానికి వైష్ణవి చైతన్య సమాధానం చెప్తూ ‘మహేష్ బాబు రేంజ్ అక్కర్లేదు కానీ, చాలా మామూలుగా నా మనస్తత్వానికి తగ్గట్టుగా ఉంటే చాలు’ అని అంటుంది.

Vaishnavi Chaitanya Saree Photos

‘మరి షన్ను లాంటోడు కావాలా?’ అని బిత్తిరి సత్తి అడగగా, దానికి వైష్ణవి వద్దు నాకు ఇలాంటోళ్ళు వద్దు, షన్ను ఒక మంచి స్నేహితుడు మాత్రమే అని సమాధానం ఇస్తుంది. ఆమె అప్పట్లో మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నెటిజెన్స్ ఆమెకి సంబంధించిన విషయాలను తెలుసుకునే క్రమం లో వెతికినప్పుడు దొరికిన వీడియో ఇది.