ఒక్క హిట్ కే పొగరు చూపిస్తున్న వైష్ణవి చైతన్య.. ముందుగా ఆ పని చేస్తే కానీ డేట్స్ ఇవ్వదట!

- Advertisement -

సినీ రంగం లో రాణించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది, కానీ కోట్ల మందిలో కొంతమఞ్చడికే ఆ అదృష్టం లభిస్తుంది. ఒకప్పుడు అయితే ఆడిషన్స్ ద్వారా నటీనటులను ఎంపిక చేసుకునేవారు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ మరియు ఇంస్టాగ్రామ్ వంటి ప్రధాన మాధ్యమాలలో అందం మరియు టాలెంట్ ఉన్నవాళ్లు షార్ట్ ఫిలిమ్స్ మరియు రీల్స్ చేస్తూ , తద్వారా కోట్లాది మంది నెటిజెన్స్ కి దగ్గరై, ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు సంపాదించి స్టార్స్ గా ఎదిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు.

వైష్ణవి చైతన్య
వైష్ణవి చైతన్య

ఆ కొంతమంది లో ఒకరు వైష్ణవి చైతన్య. యూట్యూబ్,ఇంస్టాగ్రామ్ వంటి యాప్స్ ని జూపయోగించే వారికి పరిచయం అక్కర్లేని పేరు వైష్ణవి చైతన్య. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి ఆమె చేసిన ‘సాఫ్ట్ వేర్ ఇంజనీర్’ అనే వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

ఈ వెబ్ సిరీస్ ద్వారా వైష్ణవి చైతన్య యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. అప్పటి నుండి ఈమెకి సినిమాల్లో కూడా అవకాశాలు బాగా వచ్చేవి , కానీ అన్నీ చిన్న చిన్న పాత్రలే. అయితే రీసెంట్ గా ఈమె ‘బేబీ’ చిత్రం ద్వారా హీరోయిన్ గా నటించి, భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమా ద్వారా ఆమెకి వచ్చిన క్రేజ్ మామూలుది కాదు. దీంతో ఈమెకి ఇప్పుడు హీరోయిన్ గా వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అన్నట్టుగా, డిమాండ్ ఉన్నప్పుడే డబ్బులు బాగా సంపాదించాలి అని బలంగా ఫిక్స్ అయ్యి ఇప్పుడు ఈమె రెమ్యూనరేషన్ కూడా భారీ గానే డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

అందుతున్న సమాచారం ప్రకారం ఈమె ఇప్పుడు ఒక్కో సినిమాకి రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తుంది అట. అంతే కాదు, సినిమా కి సంతకం చేసిన వెంటనే అడ్వాన్స్ కూడా ఇచ్చేయాలి అట, అప్పుడే ఆమె సినిమాకి డేట్స్ ఇస్తాను అని కండిషన్ పెడుతుంది. కెరీర్ ప్రారంభం లోనే ఇంత డిమాండ్ చేస్తే పైకి రావడం కష్టం, అంత పొగరు అక్కర్లేదు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here