Vaishnavi Chaitanya : బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన బేబీ బ్యూటీ.. స్టార్ హీరోతో అవకాశం?

- Advertisement -

Vaishnavi Chaitanya : బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. వైష్ణవి చైతన్య. ప్రస్తుతం ఇండస్ట్రీలో అమ్మడి పేరు మారుమోగిపోతుంది. గతంలో వైష్ణవి చైతన్య పలు వెబ్ సిరీసుల్లో నటించి యూట్యూబర్ గా పేర్గాంచింది. మొదటి సినిమాతోనే తెలుగు హీరోయిన్ల స‌త్తా ఏంటో ఇండస్ట్రీకి రుచి చూపించింది. స్టార్ సెలబ్రిటీలు సైతం వైష్ణవిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ అమ్మడికి వరుసగా ఆఫ‌ర్లు వస్తున్నాయి.

Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya

తాజాగా వైష్ణ‌వి చైత‌న్య ఓ బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రెండో సినిమానే ఓ స్టార్ హీరోతో చేయ‌బోతోందట. ఇంత‌కీ ఆ స్టార్ హీరో మరెవరో కాదట.. యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్. ప్రస్తుతం ఈ హీరో బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్పంద అనే సినిమా చేస్తున్నారు. దీంతో పాటే పూరి జగన్నాథ్ తో డబుల్ ఇస్మార్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.

గతంలో వారి కాంబోలో వచ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఇస్మార్ట్ శంక‌ర్‌కు సీక్వెల్ ఇది. ఇటీవ‌లె ఈ మూవీ షూటింగ్ మొదలైంది. విశేషమేమిటంలే ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా రామ్ ను ఢీకొట్టబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లకు ఛాన్స్ ఉందట. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ గా వైష్ణవిని సెలక్ట్ చేశారట. బేబీలో వైష్ణ‌వి న‌ట‌న చూసి పూరి ఆశ్చర్యపోయి ఆమెను ఎంపిక చేశారని టాక్. అందుకే ఆమెకు ఓ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బేబీ సినిమాలో తన నటన చూసిన రామ్ వైష్ణ‌వికి రామ్ పెద్ద ఫ్లెవ‌ర్ బొకేను పంపిన విషయం తెలిసిందే. బొకే బేబీ హిట్ కొట్టినందుకే కాదు.. డ‌బుల్ ఇస్మార్ట్ లో హీరోయిన్ గా ఎంపిక అయినందుకు కూడా అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here