హన్సిక ఫియాన్సీకి ఇది వరకే పెళ్లైందా.. ఆ పెళ్లికి తనుకూడా వెళ్లిందా.. ?హన్సిక ఫియాన్సీకి ఇది వరకే పెళ్లైందా.. ఆ పెళ్లికి తనుకూడా వెళ్లిందా.. ?

కోలీవుడ్ బ్యూటీ హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తన బాయ్ ఫ్రెండ్ సొహైల్ ను ఆమె డిసెంబర్ 4న వివాహమాడబోతోంది. చాలా రోజులుగా హన్సిక పెళ్లి గురించి నెట్టింట తెగవార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈ బ్యూటీ ఇటీవలే సోషల్ మీడియాలో తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఇక అప్పటి నుంచి అతను గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్.. నెట్టింట తెగ సర్చ్ చేస్తున్నారు. 

సొహైల్ గురించి తెలుసుకుంటున్న ఫ్యాన్స్ కి ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. తమ అందాల రాశి.. ఫేవరెట్ హీరోయిన హన్సిక పెళ్లిచేసుకోబోతున్న సొహైల్ కి ఇది వరకే పెళ్లి అయిందని.. మొదటి పెళ్లికి హన్సిక కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. సొహైల్ మొదటి భార్య హన్సిక క్లోజ్ ఫ్రెండేనట. రెండేళ్ల క్రితం సొహైల్ తన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నాడని సమాచారం.

స్వతహాగా బిజినెస్ మెన్ అయిన సొహైల్.. హన్సికకు సంబంధించిన పలు వ్యాపారాల్లో పార్టనర్. అలా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. తన బెస్ట్ ఫ్రెండ్ తో సొహైల్ విడాకులు తీసుకున్న తర్వాత హన్సిక అతడితో డేటింగ్ షురూ చేసింది. ఇటీవలే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న సొహైల్ మొదటి పెళ్లి గురించి హన్సిక ఏదైనా క్లారిటీ ఇస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.