అతడితో హన్సిక పర్సనల్ ఫొటో లీక్.. ఈ బ్యూటీ రియాక్షన్ ఏంటంటే..?



దేశముదురు బ్యూటీ హన్సిక త్వరలోనే తన బాయ్ ఫ్రెండ్ సొహైల్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సొహైల్‌తో వచ్చే నెలలో ఆమె వివాహం జరగనుంది. ఈ సమయంలో హన్సికకు సంబంధించిన ఒక పర్సనల్ ఫొటో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. అందులో హన్సిక ఓ వ్యక్తితో బోట్ లో సరదాగా షికారుకు వెళ్తూ కనిపించింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే.. తను పెళ్లి చేసుకోబోయే సొహైల్.

 ఈ  ఫొటోలో హన్సిక, సొహైల్ కలిసి బోట్‌లో సరదాగా షికారుకు వెళ్తూ కనిపించారు. hansika.officiaal అనే పేరుతో ఉన్న ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి ఇది బయటకు వచ్చింది. దీనిపై హన్సిక స్పందిస్తూ ఇది తన ఖాతా కాదని.. ఫేక్‌ అకౌంట్‌ అని రిప్లై ఇచ్చారు. ఇది లీక్‌ చేసిన ఫొటో లేదా మార్ఫింగ్‌ ఫొటో  అయి ఉండొచ్చని పలువురు అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక, రాజస్థాన్‌ జైపూర్‌లోని ఓ రాజకోటలో డిసెంబర్‌ 4న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. డిసెంబర్‌ 2 నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి.