3 నిమిషాలకు 3 కోట్లు.. నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న ఊర్వశి రౌతుల

- Advertisement -

మిస్ యూనివర్స్ గా నిలిచి ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ బ్యూటీ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు ని తెచ్చుకున్న నటి ఊర్వశి రౌతుల. ఈమె రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘బాస్ పార్టీ’ అనే సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి చిందులేసింది.

ఊర్వశి రౌతుల
ఊర్వశి రౌతుల

ఈ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత రీసెంట్ గానే అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’ చిత్రం లో సూపర్ హిట్ సాంగ్ గా నిల్చిన ‘వైల్డ్ సాలే’ అనే పాటలో ఆడిపాడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘బ్రో’ మూవీ లో ఒక ఐటెం సాంగ్ చేసింది.

urvasi rautela

ఈ పాట కోసం ఆమె మూడు రోజుల కాల్ షీట్స్ ఇచ్చింది, ఈ మూడు రోజులకు గాను ఆమె మూడు కోట్ల రూపాయిలు డిమాండ్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. అంతే కాదు పాట నిడివి కి తగ్గట్టుగా కూడా రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందట,మూడు నిమిషాలు పాటలో కనిపిస్తే ఆమెకి మూడు కోట్ల రూపాయిలు ఇవ్వాలట. అలా ఒక పాటలో ఎన్ని నిమిషాలు కనిపిస్తే అన్ని కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -
urvasi rautela photos

ఐటెం సాంగ్స్ కి ఊర్వశి రౌతుల రేంజ్ రెమ్యూనరేషన్లు పాన్ ఇండియన్ లెవెల్ లో మంచి డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ కూడా డిమాండ్ చెయ్యడం లేదని, నిర్మాతలు ఈమెని సంప్రదించాలంటేనే బయపడిపోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. అందుకే ఈమె ఎంత అందంగా ఉన్నప్పటికీ ఈమెని సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకోవడానికి భయపడిపోతున్నారు నిర్మాతలు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here