పవన్ కళ్యాణ్ ‘బ్రో’ చిత్రాన్ని 3D లో కూడా విడుదల చేయబోతున్నారా..? ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉన్న చిత్రం ‘బ్రో ది అవతార్’. ఈ సినిమా వచ్చే నెల 28 వ తారీఖున విడుదల అవ్వబోతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ మరియు ఊర్వశి రౌతుల మధ్య ఒక పార్టీ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

గత రెండు రోజుల నుండి ఈ పాట షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. వచ్చే నెలలో సినిమా విడుదల ఉన్నప్పటికీ కూడా, ఇప్పటి వరకు కేవలం రెండు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ మాత్రమే విడుదల అయ్యాయి. వీటికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, వాళ్ళు చాలా కాలం నుండి ఆతృతగా టీజర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

Bro mOvie

గత వారం లోనే విడుదల అవ్వాల్సిన ఈ టీజర్ కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురు అవ్వడం వల్ల విడుదల చేయలేకపోయారు. వచ్చే వారం ఈ టీజర్ విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాని 3D వెర్షన్ లో కూడా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట. సినిమాలో చాలా షాట్స్ 3D కి స్కోప్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే బయటకి రానున్నట్టు సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పతాక సన్నివేశాల్లో ఆయన తన విశ్వరూపాన్ని చూపిస్తాడట. ఆ సన్నివేశాలన్నీ 3D లో చూస్తే అద్భుతమైన అనుభూతి కలుగుతుందని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహించగా, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here