Shaakuntalam : మూవీకి అల్లు అర్హ డబ్బింగ్.. చూసి మురిసిపోతున్న అల్లు అర్జున్

- Advertisement -

Shaakuntalam : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ శాకుంతలం సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్యూటీ ఫొటోలు అల్లు అర్జున్-స్నేహ తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అందుకే అర్హ సోషల్ మీడియాలోనూ చాలా ఫేమస్. తన బుజ్జి బుజ్జి మాటలతో.. క్యూట్ క్యూట్ ఎక్స్​ప్రెషన్స్​తో అల్లు అర్జున్​తో అర్హ చేసే అల్లరి నెటిజన్లకు సుపరిచతమే. అయితే అర్హ ఇప్పుడు తన మొదటి సినిమా కోసం రెడీ అవుతోంది.

Allu Arha Dubbing for Shaakuntalam
Allu Arha Dubbing for Shaakuntalam

గుణ శేఖర్ డైరెక్షన్​లో టాలీవుడ్ స్టార్ హీరోయిన సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న శాకుంతలం సినిమాలో అల్లు అర్హ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథని శాకుంతలం సినిమాగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. అయితే అర్హ ఈ సినిమాలో శకుంతల తనయుడు భరత రాజు చిన్నప్పటి క్యారెక్టర్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రబృందం రిలీజ్ చేసిన ట్రైలర్​లో చివరగా ఓ సింహంపై అర్హ వస్తూ కనిపిస్తుంది. ఈ ట్రైలర్​లో అర్హ ఎంట్రీ హైలైట్ అని చెప్పుకోవచ్చు.

Allu arha

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది అర్హ. శాకుంతలం సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంది అల్లు అర్హ. దానికి సంబంధించిన ఫొటోను తన తల్లి స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోని అల్లు అర్జున తన స్టోరీలో కూడా షేర్ చేసి తన కూతురు డబ్బింగ్ చెబుతోందని తెగ మురిసిపోతున్నాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు బన్నీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు.

- Advertisement -

శాకుంతలం సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేస్తుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. మరో పక్క ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్, ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో అర్హ సింహంపై కూర్చొని రావడంతో.. సినిమాపై ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది ఆడియన్స్ లో.

ఇక ట్రైలర్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది. విజువల్ వండర్​లా అనిపించడంతో.. శాకుంతలం సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here