Upasana Konidela : మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి అందరికి తెలుసు..ఎన్నో కార్యక్రమాలు చేస్తూ జనాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు మెగా ఫ్యామిలీ గౌరవాన్ని పెంచుతుంది..మెగా కోడలుగానే కాకుండా బిజినెస్ లలో సత్తాను చాటుతూ వస్తున్నారు..అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ గానే కాకుండా సామాజిక కార్యక్రమాలను చేస్తూ జనాల్లో మంచి ఆదరణ పొందారు..తాజాగా మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు ఉపాసన.. అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

తాజాగా పేదల కోసం ఆర్థిక సాయం చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో హౌస్ ఆఫ్ టాటా నుండి Zoya కొత్త స్టోర్‌ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరై గోల్డ్ స్టోర్ ను లాంచ్ చేశారు. తద్వారా వచ్చిన రెమ్యూనరేషన్ ను ఉపాసన పేదల కోసం ఉపయోగించారు.. ఆ రెమ్యూనరేషన్ ను దోమకొండ పోర్ట్, విలేజ్ డెవలప్ మెంట్ ట్రస్ట్ కు విరాళంగా అందించారు. ట్రస్టు ద్వారా అణగారిన, వెనకబడిన వారిని ఆదుకునేందుకు ఆర్థిక సాయం అందించారు. మహిళా సాధికారతకు, పిల్లల చదువులకు ఆ డబ్బు ఉపయోగపడేందుకు డోనేషన్ ఇచ్చారు..

ఆలాగే ఉపాసన గిఫ్ట్ ఇచ్చిన ఖరీదైన ఈయర్ రింగ్స్ ను కూడా ట్రస్ట్ కే అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఉపాసన మెగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో నెటిజన్లు చరణ్ వైఫ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. అందుకు చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు.. అంతేకాదు దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ చొరవ ద్వారా మహిళల సాధికారత కోసం సహకరించిన జోయాకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు. జోయా స్టోర్ హస్తకళ, రకరకాల డిజైన్స్ ఉన్నాయని తెలిపారు.. త్వరలోనే మెగా ఫ్యామిలీ లోకి వారసుడు రాబోతున్నాడు.. ఇటీవల ఉపాసన సీమంతం ఫొటోలు వైరల్ అయ్యాయి..