Ram Charan – Upasana : వామ్మో.. ఉపాసనకు రామ్ చరణ్ అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడా..



Ram Charan – Upasana : టాలీవుడ్ మోస్ట్ లవ్‏బుల్ కపుల్స్‏లో రామ్ చరణ్.. ఉపాసన జోడి ఒకటి. హీరోగా అరంగేట్రం చేసిన కొన్నాళ్లకే చరణ్.. అపోలో హాస్పిటల్స్ అధినేత మనవరాలు ఉపాసనను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నారు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరిని ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Ram Charan - Upasana
Ram Charan – Upasana

తాజాగా ఉపాసన ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ రామ్ చరణ్ తనకు ఇచ్చిన మొదట గిఫ్ట్ ఏమిటో చెప్పారు. ప్రేమ గురించి అడగ్గానే తనను చెర్రీ ఎంతో ప్రేమగా చూసుకుంటాడని తెలియజేశారు. రామ్ చరణ్ తనకు మొదటి గిఫ్ట్ గా హార్ట్ సింబల్ ఉన్న చెవి కమ్మలు ఇచ్చాడని చెప్పారు. అవి అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. తనకు రిటర్న్ గిఫ్ట్ గా అపరిమిత ప్రేమను ఇచ్చానని ఉపాసన తెలిపారు. ఉపాసన – రామ్‌చరణ్‌లకు 2012 జూన్‌ 14న వివాహం జరిగింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే, చెన్నైలో ఉండగా, తొమ్మిదో తరగతి వరకూ చరణ్‌, ఉపాసన ఒకే స్కూల్‌లో చదివారు.

Ram Charan

ప్రస్తుతం ఈజంట వేకేషన్లో ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా దుబాయ్ కు వెళ్లిన ఈ జంట.. అక్కడే సీమంతం కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఓ నేషనల్ పార్క్ ను సందర్శించారు. ఇక ఇప్పటికే ఉపాసన డెలివరీకి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. ఉపాసన తన ఆరోగ్యంపై మరింతగా శ్రద్ధ తీసుకుంటోంది. మరికొద్దిరోజుల్లో రామ్ చరణ్ – ఉపాసన తండ్రి కాబోతుండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.