మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు Upasana Konidela వివాహం చేసుకున్న పదేళ్ల తర్వాత ఒక బిడ్డకి జన్మని ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారమే పదేళ్ల వరకు పిల్లల్ని కనకూడదని నిర్ణయిమ్చుకున్నామని,సమాజం మరియు కుటుంబం నుండి ఎంత ఒత్తిడి ఎదురైనా ఈ రూల్ ని బ్రేక్ చెయ్యకూడదని దంపతులిద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని,ఇప్పుడు మేము అన్నీ విధాలుగా రెడీ గా ఉన్నాము కాబట్టి పిల్లల్ని కంటున్నామని ఇటీవలే ఉపాసన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

అయితే ఉపాసన కి ప్రస్తుతం 7 వ నెల అట, 7 నెలలు గర్భం దాల్చినా కూడా బేబీ బంప్ సరిగా కనపడకపొయ్యేసరికి సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ సరోగసి ద్వారా పిల్లల్ని కంటున్నారా వంటి ప్రశ్నలను ఎదురుకోవాల్సి వచ్చింది. కానీ ఉపాసన కి బేబీ బంప్ కనపడకపోవడానికి ప్రధాన కారణం రీసెంట్ గానే తెలిసింది.
ఉపాసన కి బేబీ బంప్ కనపడకపోవడానికి ప్రధాన కారణం ఆమె ధరించే దుస్తులు అట.బేబీ బంప్ కనపడకుండా, కవర్ చేసేలా ఆమె తన దుస్తులను డిజైన్ చేయించుకుంది అట.అంతే కాదు గర్భం దాల్చినప్పుడు స్త్రీలు బాగా లావు పెరిగిపోతారు, కానీ ఇక్కడ ఉపాసన లావు పెరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటుందట.

ఒక క్రమమైన డైట్ తో శరీరం పెరగకుండా తనని తానూ నియంతరించుకుంటుందట ఉపాసన.పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం గర్భం దాల్చినప్పుడు స్టైల్ కి పోకుండా, సహజం గా ఉంటారు, కానీ ఉపాసన కి ఇంత స్టైల్ అవసరమా అని నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. లావు పెరగకుండా డైట్ ఫాలో అవ్వడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు, కానీ బేబీ బంప్ కనపడకుండా ప్రత్యేకమైన దుస్తులను సిద్ధం చేయించడమే విడ్డూరం గా ఉంది అని అంటున్నారు నెటిజెన్స్. మరి దీనికి ఉపాసన రియాక్షన్ ఏంటో చూడాలి.