Honey Rose : ఫిష్ కట్ డ్రెస్సులో హనీ రోజ్ గ్లామర్ షో.. రోజురోజుకు డోస్ పెంచేస్తూ రచ్చ

- Advertisement -

Honey Rose మొన్నటిదాక ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలియదు. కానీ వీరసింహా రెడ్డి సినిమా రిలీజ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు మార్మోగిపోతోంది. ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్ చూసినా ఈ బ్యూటీయే గెస్టుగా కనిపిస్తోంది. ఏ ఈవెంట్​ చూసినా.. ఈ భామనే స్పెషల్ అట్రాక్షన్​గా నిలుస్తోంది. అసలు అంతగా ఈ కేరళ కుట్టిని చూసి తెలుగు జనం ఎందుకు ఫిదా అవుతున్నారో తెలుసా. ఈ భామ అందం.. క్యూట్ స్మైల్.. తెలుగు కుర్రాళ్లను కనికట్టు చేసేశాయి.

Honey Rose
Honey Rose

నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో హీరోయిన్ హనీ రోజ్ స్పెషల్ అట్రాక్షన్ అయింది. వెండితెరపై ఆమె లుక్స్ చూసిన తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తన నటనతో వావ్ అనిపించి ఒక్కసారిగా జనం దృష్టిలో పడింది హనీ రోజ్. ఈ సినిమాలో హనీ రోజ్ పోషించిన మీనాక్షి పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయింది. అందంతో పాటు నటనతో మెప్పించింది ఈ కేరళ కుట్టి. వీర సింహా రెడ్డి మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది హానీ రోజ్. వీర సింహారెడ్డి ఈవెంట్స్​లో కూడా తన కట్టు బొట్టుతో హనీ రోజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఇక శ్రుతి హాసన్ అన్ని ఈవెంట్లకు అటెండ్ కాకపోవడంతో ఈ బ్యూటీకి మరింత పాపులారిటీ వచ్చేసింది.

Honey

ఇక అప్పటినుంచి నెట్టింట ఎక్కడ చూసినా ఈ హానీ ఫొటోలే కనిపిస్తున్నాయి. హనీ కూడా ఎప్పటికప్పుడు ఫొటోషూట్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను తన అందంతో మైమరిపిస్తోంది. చీర కట్టినా.. ట్రెండీ డ్రెస్ వేసినా హనీ చాలా అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చీరకట్టులో హనీ క్యూట్ స్మైల్​తో మెస్మరైజ్ చేస్తోంది. అయితే ఈ బ్యూటీ టైట్ ఫిట్ డ్రెస్సుల్లో తన భారీ అందాలు చూపిస్తూ కుర్రకారును తన మాయలో పడేస్తోంది.

- Advertisement -
Rose

తాజాగా హనీ రోజ్ డ్రెస్సులో సందడి చేసింది. ఈ ఔట్​ఫిట్​లో రెడ్ మిర్చిలా కనిపించింది హనీ. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫిష్ కట్ డ్రెస్సులో హనీ జలకన్యలా ఉందంటూ కుర్రాళ్లు తెగ మురిసిపోతున్నారు. డ్రెస్సుకు తగ్గట్టు హనీ ఇచ్చిన పోజులు మరింత అట్రాక్టివ్​గా ఉన్నాయంటూ మాట్లాడుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here