UnStoppable 2 : అన్​స్టాపబుల్​కు చిరంజీవి.. పవన్​కంటే ముందే వస్తాడట..!



UnStoppable 2 : బుల్లితెరపై అన్​స్టాపబుల్ షోతో అన్​స్టాపబుల్​గా దూసుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇదివరకు ఎన్నడూ చూడని అవతారంలో బాలయ్యను చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈ షోకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఆహా యాజమాన్యం సీజన్ 2 స్టార్ట్ చేసింది.

UnStoppable 2
UnStoppable 2

ఇక సీజన్ 2 లో వస్తున్న గెస్టులు.. వారితో బాలయ్య బాబు ఆటపాటలు.. సరదా ముచ్చట్లకు తెగ ఫిదా అవుతున్న ఫ్యాన్స్ సీజన్​-2ను బ్లాక్​బస్టర్ హిట్ చేస్తున్నారు. ఈ సీజన్​లో వస్తున్న గెస్టులు కూడా చాలా ఇంట్రెస్టింగ్​గా ఉన్నారు. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ ఒక పార్ట్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రభాస్ ఎపిసోడ్​తో ఆహా సర్వర్​ డౌన్ అయ్యిందనే ఈ షోకు వస్తోన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ గెస్ట్ పవన్ కల్యాణ్ అని ఇప్పటికే ఆహా హింట్ ఇచ్చింది.

Pawan Kalyan and Balakrishna
Pawan Kalyan and Balakrishna

బాలయ్య- పవన్ కల్యాణ్.. సినిమాల్లోనే కాదు పాలిటిక్స్​లోనూ ఈ ఇద్దరిది వేర్వేరు రూట్స్. మరి ఈ ఇద్దరు కలిసి ఒకే వేదికపై కనిపిస్తారన్న ఊహే ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. పవన్ ఎపిసోడ్​కు సంబంధించి షూటింగ్ కూడా షురూ అయిందట. అయితే ఈ ఎపిసోడ్​ను సంక్రాంతికి కానుకగా స్ట్రీమ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షోకు సంబంధించి ఇప్పుడు నెట్టింట్లో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ షోకు గెస్ట్​గా రాబోతున్నారట.

Chiranjeevi and balakrishna
Chiranjeevi and balakrishna

అయితే ఈ ఎపిసోడ్​ పవన్ కల్యాణ్ ఎపిసోడ్​ కంటే ముందే స్ట్రీమింగ్ అవుతుందట. ఈ ఎపిసోడ్ మొత్తం ఈ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మరియు బాలయ్య ‘వీరసింహా రెడ్డి’ సినిమాలపైనే ఉండబోతుందట.. ఈ రెండు సినిమాలు జనవరి 12, జనవరి 13న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు నిర్మాత ఒకరే. ఈ సందర్భంగా ఇలా చేస్తే రెండు సినిమాలకు ప్రమోషన్స్ కలిసొస్తాయని ఈ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఐడియా మెగాస్టార్ చిరంజీవికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే బాలయ్య అన్‌స్టాపబుల్​లో వీర సింహా రెడ్డి ఎపిసోడ్ అంటూ ఓ వార్త వచ్చింది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా బయటకి రాబోతున్నట్టు సమాచారం. ముందుగా పవన్ కల్యాణ్ ఎపిసోడ్​ని సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేయాలనుకుంది ఆహా టీమ్. కానీ దానికంటే ముందు చిరు ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాలకు ప్లస్ అవుతుందనే ఆలోచనలో ఉన్నారట.

త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి ఈ ఎపిసోడ్ ని టెలికాస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి చిరు ఐడియాతో బాలయ్య షో కోసం వేసిన ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేలా కనిపిస్తోంది. ఒక వేళ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి ఇద్దరు కలిసి వస్తే ఇక అభిమానులకు పూనకాలే.

Tags: