Honey Rose : హనీ రోజ్ గురించి నమ్మలేని నిజాలు.. పాత హీరోయినేనా..

- Advertisement -

Honey Rose : ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన హీరోయిన్ హనీ రోజ్..ఈ అమ్మడు బాలయ్య హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వీర సింహారెడ్డి సినిమాలో సీనియర్ బాలకృష్ణకి భార్యగా మీనాక్షి పాత్రలో నటించి అందరిని కట్టిపడేసింది.చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తున్న ఈమె అందం యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.ఒక్క మాటలో చెప్పాలంటే బాలయ్య ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది..అంత అందంగా ఉంది.. అయితే ఈ హనీ రోజ్ గురించి చాలామందికి తెలియని కొన్ని నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Honey Rose
Honey Rose

ఈమె కేరళ అమ్మాయి..14 ఏళ్ల వయసులోనే మలయాళ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాక వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక మలయాళ సినిమాల్లోనే కాకుండా తమిళ్,కన్నడ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే తెలుగులో ఈమె మొదటి సినిమా వీరసింహారెడ్డి కన్నా ముందే దాదాపు 15ఏళ్ల క్రితమే..2008లో శివాజీ హీరోగా వచ్చిన ఆలయం అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది..

Honey Rose Photos

అయితే ఆ సినిమా పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు.. ఆ తర్వాత వరుణ్ సందేశ్ ఈ వర్షం సాక్షిగా సినిమాతో మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఈ సినిమా కూడా అంతగా పేరు తెచ్చిపెట్ట లేకపోవడంతో తెలుగు ఇండస్ట్రీలో హానీ రోజ్ కనుమరుగైపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ఇ ఆమె సినిమాల కోసం వెతుకుతున్నారట.. ఇక మళ్ళీ ఇన్ని ఏళ్లకు హనీ రోజ్ కి వీర సింహారెడ్డి సినిమాతో అదృష్టం తలుపులు తట్టినట్లయింది.

- Advertisement -

వీర సింహారెడ్డి సినిమాలో నటించే అవకాశం రావడం ఆమె సినీ కెరీర్నే మలుపు తిప్పింది.. చూపు తిప్పని ఈమె అందం అందర్నీ కట్టిపడేసింది. ఇక ఈసినిమాతో ఈమె తెలుగు ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. వరుస అవకాశాలు ఈ హీరోయిన్ కు వస్తున్నాయి. బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా హనీ రోజ్ హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం.. ఏది ఏమైనా ఈమె అందం మాత్రం కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here