Mrunal Thakur : చీరకట్టులో సీతమ్మ.. ఎంత సక్కగున్నావమ్మా..

- Advertisement -

Mrunal Thakur .. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో తిష్టవేసుకుని కూర్చుంది. సీతారామం చిత్రంలో సీతగా ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయింది. ఈ సినిమాలో ఆమె నటనకు యావత్ సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒక్క సినిమాతోనే ఈ బ్యూటీ సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయింది. ఆ మూవీలో ఈ బ్యూటీ ఎంత ట్రెడిషనల్​గా ఉందో.

Mrunal Thakur
Mrunal thakur

మృణాల్ అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచచేది చీరలో పదహారణాల తెలుగమ్మాయి రూపం. ఈ బ్యూటీ తెరపైనే కాదు రియల్​ లైఫ్​లోనూ చాలా ట్రెడిషనల్​గా ఉంటుంది. ఇక ట్రెడిషనల్​ వేర్​లో అది కూడా చీరకట్టులో సీత ఎంత ముద్దుగా ఉంటుందో. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా పట్టుచీరలో ఉన్న ఫొటోలు పోస్టు చేసింది.

Mrunal Thakur Saree Photos

పింక్ కలర్ పట్టుశారీలో సీత బాపుబొమ్మలా కనిపించింది. తన క్యూట్ లుక్స్​తో ఫ్యాన్స్​ను ఫిదా చేసింది. సోషల్ మీడియాలో మృణాల్ పోస్టు చేసిన ఈ ఫొటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల కింద మృణాల్.. సారీ లవ్ అంటూ ఓ అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ క్యాప్షన్ చూస్తుంటే మృణాల్​కు చీరలంటే చాలా ఇష్టముందని తెలుస్తోంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు మెస్మరైజ్ అవుతున్నారు.

- Advertisement -
Mrunal Thakur Saree Stills

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకుందా అంటూ పాటలు పాడేసుకుంటున్నారు నెటిజన్లు. మరికొందరేమో.. పింక్ కలర్ చీరలో ఎంత సక్కగున్నావే అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. చీరకట్టులో సీత అందం మాటల్లో చెప్పలేమంటూ గారాలు పోతున్నారు ఫ్యాన్స్. అభిమానుల పొగడ్తలతో కామెంట్ బాక్స్ నిండిపోతోంది.

Mrunal thakur Images
Mrunal thakur

మృణాల్ ఠాకూర్ – దుల్కర్ సల్మాన్ కలిసి నటించిన సీతారామం.. తెలుగు, తమిళ్​లోనే కాదు.. హిందీలోనూ భారీ కలెక్షన్స్ సాధించింది. హను రాఘవపూడి తెరకెక్కించిన  ఈ సినిమాను అశ్వినీ దత్ నిర్మించారు. ఈ సినిమా తర్వాత మృణాల్ తెలుగులో మరో సినిమా చేయాలని చాలా ఈగర్​గా వెయిట్ చేస్తోంది. ఇటీవలే మృణాల్ సెకండ్ సినిమా కూడా కన్ఫమ్ అయినట్లు తెలుస్తోంది.

Mrunal thakur Latest Photos
Mrunal thakur

మృణాల్ ఛాన్స్ కొట్టేసింది మరెవరితోనో కాదు ఏకంగా నేచురల్ స్టార్ నాని సినిమాలో. నాని 30వ చిత్రం.. వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాతలు మోహన్ చేరుకూరి డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ నాని సరసన నటించనున్నట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది. నూతన దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. మరి నాని-మృణాల్ జంట ఎలా అలరిస్తుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here