Bhola Shankar నుంచి క్రేజీ అప్డేట్..కీలక పాత్రలో అక్కినేని యంగ్ హీరో..

- Advertisement -

Bhola Shankar మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇటీవల విడుదల అయిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.. ప్రస్తుతం భోళాశంకర్ సినిమా లో నటిస్తున్నారు..మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తోంది..అలాగే మెగాస్టార్ సిస్టర్ గా అందాల భామ కీర్తి సురేష్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ తమిళ్ లో వచ్చిన వేదలమ్ కు రీమేక్ గా రానుంది. ఈ తమిళ్ లో అజిత్ హీరోగా నటించాడు. ఈ అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

Bhola Shankar
Bhola Shankar

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు పై ఆసక్తిని క్రియేట్ చేశాయి.. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ ను విడుదల చేశారు మేకర్స్.. అక్కినేని యంగ్ హీరో ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారని అనౌన్స్ చేశారు..అక్కినేని సుశాంత్ ఈ మూవీలో కీలక పాత్రలో నటించనున్నాడు. తాజాగా సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా అతని విషెస్ చెప్పింది భోళా శంకర్ టీమ్. ఇక సినిమాలో చిరును చాలా స్టైలిష్ లుక్ లో చూపిస్తున్నారు మెహర్ రమేష్. ఈ షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు మేకర్స్. త్వరలోనే భోళాశంకర్ నుంచి కీలక అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది..

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ఈ సినిమా పోస్టర్స్, అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకున్నాయి..ఇందులో భాగంగా తనకి బాగా అచ్చొచ్చిన కలకత్తా ప్రాంతంలో ఓ పాటను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది..ఈ పాటలో తమన్నాతో కలిసి మెగాస్టార్ స్టెప్పులేయనున్నారు. 1998 లో వచ్చిన ‘చూడాలని ఉంది’ చిత్రం ఎక్కువ భాగాన్ని కలకత్తాలో చిత్రీకరించారు. ఆ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను ‘భోళాశంకర్‘ కు కొనసాగించాలని మెగాస్టార్ నిర్ణయించినట్లు సమాచారం.. ఈ ఏడాదిలోనే సినిమా ను విడుదల చేయనున్నారు..మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here