Trisha Krishnan ఈ భామ సినిమాల్లోకి అడుగుపెట్టి రెండు దశాబ్ధాలు గడుస్తున్నా ఈ భామకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఈ బ్యూటీ యంగ్ హీరోలతో జతకడుతూనే ఉంది. వయసు పెరిగినా ఈ బ్యూటీ వన్నె మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు మరింత యంగ్ గా కనిపిస్తూ అభిమానులను ఆకర్షిస్తోంది. తాజాగా ఈ భామ పొన్నియున్ సెల్వన్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

పొన్నియున్ సెల్వన్ 2 ప్రచారంలో బిజీగా ఉన్న త్రిష.. ట్రెండీ, ట్రెడిషనల్ ఔట్ ఫిట్స్ తో దర్శనమిస్తోంది. తమిళనాట ఈ మూవీ ప్రమోషన్స్ కోసం చాలా ట్రెడిషనల్ గా రెడీ అవుతోంది. మరోవైపు ట్రెడిషనల్ ఔట్ ఫిట్స్ కు కాస్త క్లాసీ లుక్ యాడ్ చేస్తోంది. త్రిష పొన్నియున్ సెల్వన్ ఈవెంట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఈవెంట్ కోసం త్రిష బ్లూ కలర్ అనార్కలీ డ్రెస్సులో సందడి చేసింది. తల్లో పూలు పెట్టుకుని అచ్చమైన భారతీయురాలిగా సందడి చేసింది. త్రిష ఈ లుక్ చూసి అభిమానులు పులకరించిపోయారు. ఎంత ట్రెండీగా ఉన్నా.. త్రిష ట్రెడిషనల్ లుక్ లో మాత్రం అదిరిపోయిందంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి త్రిషను కదా మేం కోరుకుంది అంటూ తమ ప్రేమను లవ్, ఫైర్ ఎమోజీస్ తో కురిపిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే త్రిష క్రీమ్ కలర్ ఔట్ ఫిట్ లో సందడి చేసింది. ఈ డ్రెస్సులో త్రిష చాలా అందంగా కనిపించింది. చాలా ట్రెండీగా త్రిష ఈ లుక్ ని క్యారీ చేసిందంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. త్రిష డ్రెస్సింగ్ సూపర్ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఎవర్ గ్రీన్ హీరోయిన్ త్రిష అంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. వీ లవ్ యూ త్రిష అంటూ తమ ప్రేమను కామెంట్ బాక్స్ లో నింపేస్తున్నారు.

ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే ఈ భామ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసి చాలా ఏళ్లవుతోంది. ప్రజెంట్ ఈ భామ ఫోకస్ అంతా తమిళనాడుపైనే ఉంది. ఈ బ్యూటీ తాజాగా ఇళయదళపతి విజయ్ తో కలిసి లియో సినిమాలో సందడి చేయనుంది.