మన భారత దేశ చిత్రాల్లోనే నేడు బ్లాక్ డే అని చెప్పొచు. ఇటీవల కాలం లో ఎప్పుడూ జరగనటువంటి ఘోరమైన రైలు ప్రమాదం నేడు ఒడిశా లోని బాలాసోర్ ప్రాంతం లో చోటు చేసుకోవడం యావత్తు ప్రజానీకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. కోరోమండల్ ఎక్స్ ప్రెస్ మరియు యస్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రెండు కూడా ఢీ కొనడం తో అందులో ప్రయాణిస్తున్న 300 మంది ప్రయాణికుల్లో 50 మంది చనిపోగా, మరో 250 మంది తీవ్రమైన గాయాలపాలయ్యారు. రైల్వే అధికారుల నిర్లక్యం కారణంగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన ఫోటోలను చూస్తే ఎలాంటి వాడికైనా కంటతడి రాక తప్పదు. చనిపోయిన వాళ్ళందరి శవాలను ఒక రూమ్ లో వేసి ఉన్న విజువల్స్ చూస్తే మన మనసు ఏదోలా అయిపోతుంది. ఇలా చనిపోయిన వారిలో మన తెలుగువాళ్లు కూడా ఉన్నారు. ఇక అత్యవసర శస్త్ర చికిత్స చేయించుకుంటున్న ఎంతో మంది ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి విషమం గానే ఉంది.

ఇది ఇలా ఉండగా ఈ ప్రమాదానికి గురైన కుటుంబ సభ్యుల పట్ల తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్త పరుస్తూ మన టాలీవుడ్ సెలెబ్రిటీలు ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తపరిచారు. చిరజీవి , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ ,వెంకటేష్ తదితరులు ఈ సందర్భంగా సంతాపం వ్యక్తపరిచారు.

ఇక చిరంజీవి అయితే సమీపం లో ఉన్న అభిమానులు క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు అందుబాటులో ఉన్నవారు వెంటనే రక్త దానం చెయ్యండి అంటూ ఆయన ఇచ్చిన పిలుపుకి స్పందించి ఎంతో మంది రక్త దానం అందించి సేవలు అందిస్తున్నారు. ఇక మరోపక్క ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రమాదానికి గురైన స్థలానికి సంబంధించిన విజువల్స్ ని పెట్టి, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచింది. సోషల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కడ చూసిన ఈ ఘోర ప్రమాదం గురించే మాట్లాడుకుంటున్నారు.