Tollywood : రూపాయికే మల్టీప్లెక్స్ లో సినిమా.. సినీ ప్రియులకు సూపర్ న్యూస్



Tollywood : మల్టీప్లెక్స్ లలో సినిమాలు చూడాలంటే ఎక్కువ రేటు పెట్టాల్సిందే. ఇక అక్కడ ఫుడ్ ధరలు అయితే ఆకాశాన్ని అంటుతాయి. కానీ రిలీజ్ రోజు మాస్, కమర్షియల్ సినిమాలు చూడాలంటే మాత్రం సింగిల్ థియేటర్స్ కే వెళ్ళడానికి ఇష్టపడతారు ప్రేక్షకులు. గతంలో కంటే ఇప్పుడు మల్టీప్లెక్స్ లలో టికెట్ రేట్లు, ఫుడ్ రేట్లు మరీ పెంచేశారు. కానీ అప్పుడప్పుడు ఈ మల్టీప్లెక్స్ లలో కూడా ఆఫర్స్ ప్రకటిస్తుంటారు.

Tollywood
Tollywood

సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేది ట్రైలరే అనడంలో ఆశ్చర్యం లేదు. అందుకే కేవలం ట్రైలర్‌ల కోసం షోలు నిర్వహించాలని నిర్ణయించారు. అందుకే విడుదలకు సిద్ధంగా ఉన్న 10 సినిమా ట్రైలర్‌లను ఎంపిక చేసి బిగ్‌ స్క్రీన్‌పై చూపించనున్నారు. వాటిలో స్థానిక భాషతో పాటు బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాల ట్రైలర్‌లు కూడా ఉండనున్నాయి. ‘ట్రైలర్‌ స్క్రీనింగ్‌ షో’ (trailer screening show)అనే కాన్సెప్ట్‌తో పీవీఆర్‌, ఐనాక్స్‌ మల్టీ ప్లెక్స్‌లు రోజులో ఒక షోని కేవలం ట్రైలర్‌లకు కేటాయించనున్నారు. అరగంట సేపు ఎంపిక చేసిన కొత్త సినిమా ట్రైలర్స్‌ను ఒక్క రూపాయికే ప్రదర్శించనున్నారు.

Tollywood MOvie

ఈ ట్రైలర్స్ లో బాలీవుడ్, హాలీవుడ్, లోకల్ లాగ్వేజ్ అన్ని ట్రైలర్స్ ఉండనున్నాయి. అయితే ఇవి ఏ మల్టీప్లెక్స్ లలో అందుబాటులో ఉంటుంది, ఏ టైంలో అందుబాటులో ఉంటాయో ఇంకా ప్రకటించలేదు. ఈ ఆఫర్ చూసి సరదాగా థియేటర్ కి వెళ్లి ఒక్క రూపాయికి AC లో, మల్టీప్లెక్స్ లో కూర్చొని ట్రైలర్స్ అన్ని చూసి రావొచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా రూ.1కే ఏసీలో కూర్చొని ఎంచక్కా రానున్న సినిమాల ట్రైలర్‌లను చూసేందుకు సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు.