Tollywood news : 2022లో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీస్ వీళ్లే..

- Advertisement -

Tollywood News : చాలా మంది కుర్రాళ్ల ఒక సినిమా చూడాలంటే ఆ మూవీలో హీరోయిన్ ఎవరని అడుగుతారు. ఎందుకంటే కంటెంట్, హీరో, డైరెక్టర్ ఇవన్నిటికన్నా కుర్రాళ్లను అట్రాక్ట్ చేసేది అందమైన హీరోయిన్. ఆకాశానికి వెన్నెల అందం ఎలాగో సినిమాకు కథానాయిక బ్యూటీ అలాగే. వెండితెరపై నాయికల సందడి.. గ్లామర్​ షోకు ఫిదా కానీ వారంటూ ఉండరు. అలాగే టాలీవుడ్​లో ( Tollywood news ) ప్రతి ఏటా చాలా మంది కొత్త కథానాయికలు ఎంట్రీ ఇస్తుంటారు. అలా ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఎవరు..? మరి ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టారా.. ఫట్​మనిపించారా చూద్దాం..

mrunal thakur
mrunal thakur

మృణాల్ ఠాకూర్.. సీతారామం మూవీతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. సీతగా ఆ మూవీలో తను పలికించిన హావభావాలు, నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాతో టాలీవుడ్​లో మృణాల్​కు వరుస ఆఫర్లు వస్తున్నాయి.

Nazriya Nazim Fahadh
Nazriya Nazim Fahadh

నజ్రియా ఫాహద్.. హలో బ్రదర్ అంటూ రాజారాణి మూవీతో తెలుగు ప్రేక్షకులకు నజ్రియా పరిచయమే. కానీ ఇది డబ్బింగ్ సినిమా. నజ్రియా స్ట్రెయిట్ తెలుగు మూవీ అంటే సుందరానికి తో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.

- Advertisement -
Samyuktha menon
Samyuktha menon

ఫస్ట్ సినిమాయే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన హీరోతో ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది. మన సంయుక్త మీనన్ పరిస్థితి అదే మరి. భీమ్లా నాయక్ మూవీలో రానాతో జంట కడుతూ టాలీవుడ్​లో తెరంగేట్రం చేసింది ఈ బ్యూటీ. తన పాత్ర కాసేపే ఉన్నా.. ఉన్నంత సేపు తన నటన, గ్లామర్​తో ఆకట్టుకుంది.

Asha bhat
Mithila palkar

పొట్టి నూడుల్స్.. ఇదేంటనుకుంటున్నారా. ఓరి దేవుడా మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. విశ్వక్ సేన్ సరసన పొట్టి నూడుల్స్​గా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది మిథిలా పాల్కర్. తన క్యూట్ క్యూట్ ఎక్స్​ప్రెషన్స్​తో కుర్రాళ్లను ఫిదా చేసింది.

Asha bhat
Asha bhat

ఓరి దేవుడా మూవీతోనే టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది మరో హీరోయిన్ ఆశా భట్. విశ్వక్ సేన్​కు సీనియర్​గా నటించి అందరి మన్ననలు అందుకుంది.

Shirley setia
Shirley setia

షెర్లీ సేటియా.. ఈ బాలీవుడ్ సింగర్.. యంగ్ హీరో నాగశౌర్య నటించిన కృష్ణవ్రింద విహారి మూవీతో టాలీవుడ్​లో అడుగు పెట్టింది. మొదటి సినిమాలోనే గ్లామర్ ట్రీట్​తో కుర్రాళ్లను కట్టిపడేసింది.

Rithika naik
Rithika naik

అశోక వనంలో అర్జున కల్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రితికా నాయక్. ఈ సినిమాలో పెళ్లి కూతురు చెల్లిగా నటించి మెస్మరైజ్ చేసింది. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఈ బ్యూటీ క్యారెక్టర్​ను మరిచిపోలేరు.

Rachita ram
Rachita ram

మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన సూపర్ మచీ మూవీతో టాలీవుడ్​కు పరిచయమైంది కన్నడ బ్యూటీ రచితా రామ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయినా.. రచిత గ్లామర్, యాక్టింగ్​కు మాత్రం కుర్రాళ్లు ఫిదా అయిపోయారు.

Rajisha Vijayan

మాస్ మహారాజ రవితేజతో కలిసి రామారావు ఆన్ డ్యూటీలో సందడి చేసింది రజిషా విజయన్. తెలుగులో ఈ బ్యూటీకి ఇది మొదటి సినిమా అయినా మెచ్యూర్డ్ యాక్టింగ్​తో ప్రేక్షకులను అలరించింది. మరోవైపు జై భీమ్, జూన్​, కర్ణన్ వంటి సినిమాలతోనూ సౌత్ ఆడియెన్స్​ను ఆకట్టుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here