Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుండెలు ఆగిపోయ్యే వార్త..ఇక ఇప్పట్లో ఆ సినిమా లేనట్టే!

- Advertisement -

Prabhas : ఇండియా లోనే అతి పెద్ద సూపర్ స్టార్ ఎవరు అని అడిగితే ప్రస్తుతం మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు రెబెల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. కానీ ఆ సినిమాలకు వచ్చిన వసూళ్లు మాత్రం ప్రభాస్ తోటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలకంటే ఎక్కువ వచ్చాయి అని చెప్పొచ్చు.

ఫ్లాప్ సినిమాలకే ఆ రేంజ్ వసూళ్లు వస్తే, ఇక హిట్ సినిమాలకు ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు అనుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 22 వ తారీఖున విడుదలైన ‘సలార్’ చిత్రం తో తనకి హిట్ టాక్ వస్తే ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేసాడు ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకి 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

అయితే ఈ సినిమా సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పార్ట్ 1 లో చెప్పాల్సిన ఎన్నో విషయాలు, ట్విస్టులు పార్ట్ 2 లో ఉండబోతున్నట్టుగా క్లైమాక్స్ లో చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుండి మొదలవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ అందుతున్న వార్త ఏమిటంటే, ఈ సినిమా ఇప్పట్లో లేకపోవచ్చు అట.

- Advertisement -

ప్రశాంత్ నీల్ కి ప్రస్తుతం ‘సలార్ 2’ తీసే ఆలోచనే లేదని, ఆయన ద్రుష్టి మొత్తం ఎన్టీఆర్ సినిమా మీదనే ఉందని, అతి త్వరలోనే ఎన్టీఆర్ తో షూటింగ్ ప్రారంభిస్తారని, ఈ సినిమా అయిపోయాకనే ‘సలార్ 2’ గురించి ఆలోచిస్తాడని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి గుండెలు ఆగుతాయనే చెప్పాలి. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here