Ileana : బాత్రూంలో ఇలియానా సెల్ఫీ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న హాట్ ఫొటో

- Advertisement -

Ileana హాట్ ఫోటో చూసారా? ప్రస్తుతం ఆమె తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. గతేడాది తన కొడుకు కోవాకు జన్మనిచ్చిన ఇలియానా తాజాగా ఈ బాత్రూమ్ సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఇల్లీ బేబీ షేర్ చేసిన ఈ ఫోటో నాలుగు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు తీసిన ఫోటోగా వైరల్ అవుతోంది.

Ileana
Ileana

గోవా బ్యూటీ ఇలియానా గతంలో చాలా సార్లు బికినీలో కనిపించింది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలో ఓ ప్రత్యేకత ఉంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో పోస్ట్ చేసిన ఈ ఫోటో సరిగ్గా ఒక సంవత్సరం క్రితం తీసినది. అంటే ఆ సమయంలో ఆమె గర్భవతి. ఇది తాను నాలుగు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు దిగిన ఫోటో అంటూ ఇలియానా ఈ బికినీ సెల్ఫీని షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమె గర్భవతి అని స్పష్టంగా తెలుస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో తీసిన ఈ ఫొటోకు ఏడాది పూర్తవుతోంది అంటూ ఈ ఫొటోను పోస్ట్ చేసింది. ప్రెగ్నెన్సీ డేస్ ను బాగా ఎంజాయ్ చేసిన ఆమె.. ఇప్పుడు ఆ రోజులను మిస్సయ్యానంటూ ఆ రోజులను నెమరువేసుకుంది. ప్రస్తుతం ఇలియానా తన భాగస్వామితో కలిసి అమెరికాలో ఉంటోంది.

Ileana

ఈ మిర్రర్ సెల్ఫీ బ్లాక్ అండ్ వైట్ లో ఉండ‌టం విశేషం. నలుపు రంగు బికినీలో ఒక చేత్తో తన బేబీ బంప్‌ని చూపిస్తూ సెల్ఫీ తీసుకుంది. ‘‘ఏడాది కిందటే.. నాలుగు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు’’ అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోను షేర్ చేసింది ఇలియానా. ఆమె ఇటీవల తన భాగస్వామి మైఖేల్ డోలన్‌తో కలిసి ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ వేడుకల్లో ఇద్దరూ నల్లటి దుస్తుల్లో కనిపించారు. బ్లాక్ గౌనులో ఇలియానా అద్భుతంగా కనిపించింది. నా మొదటి నిజమైన వాలెంటైన్‌కి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెబుతూ అందాల‌ నటి ఫోటోను షేర్ చేసింది. ఇక తన సినిమాల విషయానికి వస్తే ఇలియానా దో ఔర్ దో ప్యార్ సినిమాలో నటిస్తోంది. ఇందులో విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ కూడా ఉన్నారు. ఈ సినిమా మార్చి 29న విడుదల కానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here