Vijay Deverakonda : బాలనటుడిగా విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న సినిమాలు ఇవేనా..? చేసి ఉంటే వేరే లెవెల్ ఉండేది!

- Advertisement -

Vijay Deverakonda : ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరో ఎవరు అని అడిగితే మన అందరికీ టక్కుమని గుర్తుకు వచ్చే పేరు విజయ్ దేవరకొండ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన, అతి తక్కువ సమయం లోనే ‘అర్జున్ రెడ్డి’ మరియు ‘గీత గోవిందం’ లాంటి సినిమాలు చేసి యూత్ ఐకాన్ గా మారిపోయాడు.

Vijay Deverakonda
Vijay Deverakonda

ఇప్పుడు విజయ్ దేవరకొండ మార్కెట్ కి హిట్ మరియు ఫ్లాప్ తో అసలు సంబంధమే లేదు. ఎలాంటి ఫలితం వచ్చినా తన మరుసటి సినిమాకి క్రేజ్ మరియు డిమాండ్ రప్పించగలడు. అలాంటి రేంజ్ కి వచ్చిన విజయ్ దేవరకొండ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అవి తెలుసుకొని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. చిన్నప్పటి నుండి విజయ్ దేవరకొండ కి సినిమాలు అంటే విపరీతమైన పిచ్చి ఉండేది.

ఆ పిచ్చి తోనే ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అయ్యాడు. అయితే చిన్నవయసు లోనే కొన్ని సినిమాల్లో నటించడానికి ప్రయత్నం చేసాడట. అప్పట్లో యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ హీరో గా నటించిన ‘అన్నా’ చిత్రం లో ఒక చిన్న పిల్లాడి పాత్ర కోసం ఆడిషన్ నిర్వహించారు. ఈ ఆడిషన్స్ కి విజయ్ దేవరకొండ ఫోటోలు కూడా వెళ్లాయి అట. అతని లుక్ నచ్చి, పిలిపించి ఆడిషన్స్ చేసారు.

- Advertisement -

స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత ఎందుకో డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య కి విజయ్ దేవరకొండ నచ్చలేదు. దీంతో ఆయన అతనిని తప్పించి ‘బాలాదిత్య’ ని తీసుకున్నారు. ఈ పాత్ర కి అప్పట్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా ఎమోషనల్ గా సాగే ఈ పాత్రకి విజయ్ దేవరకొండ సెలెక్ట్ అయ్యి ఉంటే, చిన్నప్పుడే ఎన్నో అవకాశాలను దక్కించుకొని స్టార్ కిడ్ గా ఎదిగేవాడు అని అంటున్నారు ఫ్యాన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here