Vijay Devarakonda : వాట్సప్ కు షాకిచ్చిన విజయ్ దేవరకొండ.. రౌడీ హీరోతో మాములుగా ఉండదుగా మరి..

- Advertisement -

Vijay Devarakonda : వాట్సాప్ అధినేత మార్క్.. తాజాగా ఆ మెసేజింగ్ యాప్స్‌లోకి కొత్త ఫీచర్‌ను పరిచయం చేశాడు. అదే వాట్సాప్ ఛానెల్. ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో సెలబ్రిటీలను ఎలాగైతే ఫాలో అవుతారో.. వాట్సాప్‌లోని ఛానెల్స్‌లో కూడా యూజర్లు.. నచ్చిన సెలబ్రిటీని ఫాలో అవ్వవచ్చు. అయితే ఈ ఫీచర్ యాడ్ చేసి కొన్నిరోజులే.

Vijay-Deverakonda
Vijay Devarakonda

అయినా ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు వాట్సాప్ ఛానెళ్ల ఫాలోయింగ్ విషయంలో రికార్డులు సృష్టించారు. ఇప్పటికే కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్, సన్నీ లియోన్ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు వాట్సాప్ ఛానెళ్లు క్రియేట్ చేసుకున్నారు. మోమన్‌లాల్, మమ్ముట్టీ లాంటి సౌత్ సెలబ్రిటీలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. వాట్సాప్ ఛానెళ్ల ద్వారా తమ ఫేవరెట్ సెలబ్రిటీల దగ్గర నుండి మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు అందుకోవచ్చు యూజర్లు.

ప్రస్తుతం వాట్సాప్ ఛానెల్స్‌ లో మన విజయ్ దేవరకొండ అరుదైన రికార్డు సాధించాడు. వాట్సాప్ ఛానెల్‌లో ఫాలోయింగ్ పెంచుకుంటున్న వారిలో టాప్ 9లో ఉన్న ఒకేఒక్క తెలుగు సెలబ్రిటీ విజయ్ దేవరకొండ. తెలుగు సినిమాలో రౌడీ హీరోగా యూత్ మనసు దోచుకున్న విజయ్.. అతి తక్కువ సమయంలోనే వాట్సాప్ ఛానెల్‌లో 1.2 మిలియన్ ఫాలోవర్స్‌ను సాధించుకున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ సెలబ్రిటీల కంటే టాప్‌లో ఉన్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here