విమానాశ్రయం లో దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరోయిన్!

- Advertisement -

బాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ లీడింగ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సారా అలీ ఖాన్, ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కూతురు ఈమె. కెరీర్ ప్రారంభం నుండే తనదైన మార్కు తో సినిమాలను ఎంచుకుంటూ అనతి కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రీసెంట్ గా బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ తో కలిసి ‘జరా హాట్కే..జరా బచ్కే’ అనే చిత్రం లో నటించింది.

సారా అలీ ఖాన్
సారా అలీ ఖాన్

ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. కేవలం మొదటి వారం లోనే 37 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, అతి త్వరలోనే వంద కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరబోతోంది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా వీళ్లిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో సారా అలీ ఖాన్ చేసిన అల్లరి పనుల గురించి చెప్పుకొచ్చాడు విక్కీ కౌశల్.

Sara Ali Khan

విక్కీ కౌశల్ మాట్లాడుతూ ‘మేము ప్రొమోషన్స్ చేస్తున్న సమయం లో సారా అలీ ఖాన్ విమానాశ్రయం లోని లాంజ్ లో మంచిగా నిద్రపోయింది. ఆ తర్వాత వచ్చేటప్పుడు రూమ్ లో ఉన్న దిండు ని దొంగలించి తీసుకొచ్చింది. ఆ దిండు ని ఆమె మూడు ఊర్లకు తనతో పాటు తీసుకొచ్చింది’ అని చెప్పుకొచ్చాడు విక్కీ కౌశల్.

- Advertisement -

అప్పుడు సారా అలీ ఖాన్ ని విలేఖరులు ప్రశ్న అడుగుతూ , హోటల్ రూమ్స్ నుండి బయటకి వచ్చేటప్పుడు ఏమైంది మీతో పాటు తీసుకొచ్చారా అని అడగగా, దానికి సారా అలీ ఖాన్ సమాధానం చెప్తూ ‘ నెల రోజుల పాటు మేము ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం తిరుగుతున్నాము. అలా ఎన్నో హోటల్స్ లోకి అడుగుపెట్టాము, అలా షాంపూ , కండీషనర్లు , లోషన్స్, టూత్ పేస్ట్ ఇలా ఎన్నో వస్తువులను వచ్చేటప్పుడు నాతో పాటు తీసుకొచ్చేసాను’ అని చెప్పుకొచ్చింది సారా అలీఖాన్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here