Guess The Actress : ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఒక హంతకుడి కూతురు.. అతను ఒక స్టార్ హీరో కూడా.. ఎవరో గుర్తుపట్టారా?

- Advertisement -

Guess The Actress : ఈ ఫొటోలో ఉన్నాయి ఈ చిన్నారిని గుర్తు పట్టారా?, ఈమె ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ అయితే ఇవ్వలేదు కానీ, టాలీవుడ్ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి అందం విషయం లో ఏమాత్రం కూడా తీసిపోదు. ఈమె తండ్రి బాలీవుడ్ ఒకప్పుడు పెద్ద సూపర్ స్టార్, కానీ ఇప్పుడు మాత్రం ప్రెస్టీజియస్ భారీ బడ్జెట్ సినిమాలలో విలన్ గా నటిస్తూ బిజీ గా గడుపుతున్నాడు.

Guess The Actress
Guess The Actress

గతం లో జరిగిన ఒక ఉగ్రవాద దాడి సమయం లో ఆ ప్రముఖ నటుడి ఇంట్లో తుపాకీలు దొరకడం తో, ఆ నటుడికి టెర్రరిస్ట్ గ్యాంగ్ కి లింక్ ఉంది అని అనుమానించి ఆ నటుడిని అరెస్ట్ చేసారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకి వచ్చి ప్రస్తుతం సినిమాలు చేసుకుంటున్నాడు. ఇంత సమాచారం అందించిన తర్వాత ఆ నటుడు ఎవరో ఈపాటికే గుర్తు పట్టి ఉండాలే?,ఆయన మరెవరో కాదు సంజయ్ దత్.

Sanjay dhatt

సంజయ్ దత్ కి మూడు పెళ్లిళ్లు అయ్యాయి, అప్పట్లో ఆయన రిచా శర్మ అనే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ని ప్రేమించి పెళ్లాడాడు. అయితే ఆమెకి బ్రెయిన్ లో ట్యూమర్ ఉండేది అప్పట్లో, విజయవంతంగా సర్జరీ చేయించుకుంది కానీ, 1996 వ సంవత్సరం లో అనారోగ్యం తో చనిపోయింది. ఆ తర్వాత సంజయ్ దత్ రియా పిళ్ళై అనే మరో ఇండియన్ మోడల్ ని ప్రేమించి పెళ్లాడాడు. ఈమె తో 2008 వ సంవత్సరం లో విడాకులు తీసుకున్నాడు, మళ్ళీ అదే సంవత్సరం లో ఆయన మాన్యతా దత్ ని పెళ్లాడాడు.ప్రస్తుతం ఆమెతోనే కలిసి ఉంటున్నాడు.

- Advertisement -
Sanjay dhatt daughter

అయితే సంజయ్ దత్ మరియు రిచా శర్మ కి త్రిశాల దత్ అనే కూతురు ఉంది. ఈమె చిన్నతనం లో ఉన్నప్పుడే తల్లి చనిపోవడం తో సంజయ్ దత్ ఆమెని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని అందం ఉన్నప్పటికీ కూడా త్రిశాల దత్ సినిమాల్లోకి రావాలి అనుకోలేదు. ఈమె వయస్సు దాదాపుగా 35 ఏళ్ళు ఉంటుంది. ఈమెకి సంబంధించిన కొన్ని చిన్ననాటి ఫోటోలు మరియు ప్రస్తుతం ఉన్న ఫోటోలను మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here