Baby Movie : చీప్ రీజన్ తో హిట్ సినిమాను వదిలేసుకున్న బబ్లీ బ్యూటీ

- Advertisement -

Baby Movie రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వరుస విజయాలు సొంతం చేసుకుంటున్నాడు. తన తాజా చిత్రం బేబి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. కలర్ ఫోటో రచయితగా జాతీయ అవార్డు గెలుచుకున్న సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్‌తో యూట్యూబ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. అచ్చ తెలుగమ్మాయి కావడంతో ఈమె నటనకు మంచి మార్కుల పడ్డాయి. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించారు.

Baby Movie
Baby Movie

మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ బేబి. ఈరోజు విడుదలైన సినిమా తొలి ఆటనుంచే పాజిటివ్ టాక్ తో టీనేజర్లను ఆకట్టుకుంది. పక్క యూత్ ను టార్గెట్ చేసి తీసిన సినిమా బేబి అని సినిమా చూసిన అభిమానులు చెబుతున్నారు. కచ్చితంగా ఈ సినిమాను యూత్ చూడాలంటున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య పాత్ర సినిమాకే హైలైట్ అయింది. బస్తీ అమ్మాయిగా, గ్లామర్ గాళ్ గా లుక్స్ లోనే కాకుండా నటన పరంగా కూడా వేరియేషన్స్ చూపించింది. మొదటి సినిమాలోనే నటనా ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

అసలు ఆ పాత్రను వైష్ణవి తప్పా మరెవరూ చేయలేన్నంతగా జీవించేసింది. అయితే బేబీ మూవీకి వైష్ణవి చైతన్య ఫస్ట్ ఛాయిస్ కాదట. అసలు దర్శకుడు ప్రస్తుతం స్టార్ గా వెలుగొందుతున్న హీరోయిన్ ను సినిమాకు తీసుకోవాలనుకున్నాడట. ఆమెను దృష్టిలో పెట్టుకునే కథ రాసుకున్నాడట. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ క్రష్ శ్రీలీల. విషయం చాలా మందికి తెలియదు. ముందుగా శ్రీలీలను సంప్రదించారట మేకర్స్. అయితే చౌకబారు కారణాలతో ఆమె ఈ సినిమాను తిరస్కరించిందట. చిన్న దర్శకుడు, తక్కువ బడ్జెట్ సినిమా అని తెలిసి కథ వినకుండానే బేబీ సినిమాను రిజెక్ట్ చేసిందట శ్రీలీల. సినిమా రిలీజ్ అయి హిట్ అయ్యాక అనవసరంగా వదిలేసుకున్నానే అని బాధపడుతుందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here