హైదరాబాద్ లో ‘హరి హర వీరమల్లు’ సెట్స్ మొత్తాన్ని పీకేస్తున్న మేకర్స్..ఫ్యాన్స్ కి గుండెలు ఆగిపోయే వార్త!

- Advertisement -

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ . ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెలుగు సినిమా చరిత్రలోనే చిరస్థాయిగా గుర్తుండిపోయేలా తెరకెక్కిస్తున్నాడు. అయితే గత కొంత కాలం నుండి ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాని తాత్కాలికంగా పక్కన పెట్టి, వేరే సినిమాలతో బిజీ అయ్యాడు.

హరి హర వీరమల్లు
హరి హర వీరమల్లు

అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మళ్ళీ ఆగష్టు నుండి ప్రారంభం అవుతుందని, పవన్ కళ్యాణ్ కేవలం 30 రోజుల కాల్ షీట్స్ ఇస్తే షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. అయితే రీసెంట్ గా ఈ చిత్రం షూటింగ్ శాశ్వతంగా ఆగిపోయిందని. డైరెక్టర్ క్రిష్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య టెక్నికల్ డిఫరెన్స్ ఏర్పడిందని, ఇలా ఎన్నో రకాల వార్తలు ప్రచారం అయ్యాయి.

Hari Hara Veera Mallu

దానికి తోడు సారధి స్టూడియోస్ లో వేసిన సెట్లు మొత్తం రీసెంట్ గా తొలగించడం తో ఈ చిత్రం ఆగిపోయిందనే నిర్ణయానికి వచ్చేసారు ఫ్యాన్స్ మొత్తం. కానీ అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా సెట్స్ మొత్తం పీకేసి, ఆంధ్ర ప్రదేశ్ లో వెయ్యబోతున్నారని, పవన్ కళ్యాణ్ ఇక నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీ గా ఉండడం వల్ల ఆయన హైదరాబాద్ కి వచ్చి షూటింగ్స్ చేసేంత సమయం ఉండకపోవడం తో, ఆంధ్ర లోనే షూటింగ్స్ చేయబోతున్నామని, ఇక్కడే సెట్స్ వేస్తాం అంటూ నిర్మాతలు అధికారికంగా తెలియచేసిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ‘హరి హర వీరమల్లు’ చివరి షెడ్యూల్ ని వైజాగ్ పరిసర ప్రాంతాలలో త్వరలోనే వెయ్యబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Pawan Kalyan

మొఘల్ సామ్రాజ్యం నాటి కాలం లో జరిగిన ఫిక్షనల్ కథగా డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు, ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియోస్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం ఓరంగజేబుగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తుండగా, హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here