నిఖిల్ ‘స్పై’ మూవీ మొట్టమొదటి రివ్యూ..కాన్సెప్ట్ అదిరింది..కానీ!

- Advertisement -

సరికొత్త ప్రయోగాలు చేస్తూ అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న అతి తక్కువ మంది హీరోలలో నిఖిల్ సిద్దార్థ్ ఒక్కడు.’హ్యాపీ డేస్’ లో రాజేష్ అనే పాత్ర ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా నిఖిల్ , ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యి తన పాత్ర కి మంచి పేరు రావడం తో టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వచ్చాయి. మొదట్లో ఫ్లాప్స్ వచ్చాయి కానీ, ‘స్వామి రారా’ చిత్రం నుండి కేవలం ఒకటి రెండు సినిమాలు మినహా మిగిలినవన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి.

స్పై మూవీ
స్పై మూవీ

ఆడియన్స్ కి ఆ సినిమా సరికొత్త థియేట్రికల్ అనుభూతిని కలిగించాయి. ఇక గత ఏడాది ఆయన హీరో గా నటించిన ‘కార్తికేయ 2 ‘ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత ’18 పేజెస్’ అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు నిఖిల్. ఈ చిత్రం యావరేజి గా ఆడింది, ఇప్పుడు ఆయన హీరో గా నటించిన ‘స్పై’ చిత్రం ఈ నెల 29 వ తారీఖున గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Spy Movie

తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన తెలుగు వెర్షన్ ఫైనల్ కాపీ ప్రివ్యూ షో ని రీసెంట్ గానే కొంతమంది మీడియా మిత్రులు మరియు సినీ ప్రముఖులకు వేసి చూపించారు. ఈ ప్రివ్యూ షో కి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. సినిమాలో కంటెంట్ బలంగానే ఉంది కానీ, ఎక్కడో ఎదో మిస్ అయినా ఫీలింగ్ కలిగిందని, పెద్ద రేంజ్ హిట్ కాకపోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారట ఈ ప్రివ్యూ షో ని చూసినవాళ్లు.

- Advertisement -
Nikhil

ఔట్పుట్ హీరో నిఖిల్ కి పెద్దగా నచ్చకపోవడం, ఇప్పుడే కాదు కొన్ని రోజుల తర్వాత విడుదల చేద్దాం అని నిర్మాతతో గొడవలు పడడం, దీనిని నిఖిల్ స్వయంగా రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ఒప్పుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ చిత్రం కూడా ఫ్లాప్ అవుతుందేమో అని భయపడుతున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి ఈ చిత్రం ఫైనల్ ఫలితం ఎలా ఉండబోతుందో తెలియాలంటే 29 వరకు ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here