Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ పై సెటైర్లు విసిరిన ‘హనుమాన్’ హీరో తేజా సజ్జల..ఒక్క హిట్టుకే ఇంత బలుపా!

- Advertisement -

Junior NTR : బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి చిన్నతనం లోనే స్టార్ కిడ్ గా పేరు తెచ్చుకున్న తేజ సజ్జల, పెద్దయ్యాక హీరోగా మారి పలు సినిమాల్లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ‘హనుమాన్’ కి ముందు ఆయన నటించిన సినిమాలలో ‘జాంబీ రెడ్డి’ ఒక్కటే కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. ఇక ‘హనుమాన్’ సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మన టాలీవుడ్ లో కొంతమంది స్టార్ హీరోలు ఇప్పటి వరకు వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకోలేదు.

కానీ ‘హనుమాన్’ చిత్రం వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని కేవలం పది రోజుల్లోనే అందుకునేట్టుగా ఉంది. ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో అయితే ఈ చిత్రం ఏకంగా సలార్ రికార్డ్స్ కి ఎసరు పెట్టేలా ఉంది. కేవలం 20 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ కలలో కూడా ఊహించి ఉండరు.

ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా లో తేజా సజ్జల పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సోషల్ మీడియా లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉండడాన్ని మనం గమనించొచ్చు. అయితే నిన్న ఒక రామ్ చరణ్ అభిమాని తేజా సజ్జల పేరుతో ట్విట్టర్ లో ఒక ఫేక్ అకౌంట్ ని ఏర్పాటు చేసి, ఎన్టీఆర్ కి నా తదుపరి చిత్రం లో క్యారక్టర్ ఆర్టిస్టు రోల్ ఇస్తున్నాను అంటూ ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తూ ఒక ట్వీట్ వేస్తాడు.

- Advertisement -

ఇది అందరూ తేజా సజ్జలనే నిజంగా ట్వీట్ వేసాడని అనుకోని, అతన్ని తిట్టడం ప్రారంభించారు. ఈ విషయం తేజ వరకు చేరుకోవడం తో ఆయన వెంటనే తన వెరిఫీడ్ అకౌంట్ నుండి స్పందిస్తూ ‘ ఇది ఫేక్ అకౌంట్, నాది కాదు. దయచేసి నెగటివిటీ ని వ్యాప్తి చెయ్యకండి. ఇలాంటి చెత్తని భోగి మంటలో కలిపేద్దాం, అందరికీ భోగి శుభాకాంక్షలు’ అంటూ ఒక ట్వీట్ వేసాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here