Hi Nanna : మొదటి రోజు కంటే 3వ రోజు ఎక్కువ వసూళ్లు..ట్రేడ్ కి మతిపోగొడుతున్న ‘హాయ్ నాన్న’!

- Advertisement -

Hi Nanna : న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది చాలా అద్భుతంగా కలిసి వచ్చింది అనే చెప్పాలి. ప్రారంభం లో ‘దసరా’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నాని, ఆ సినిమాతోనే వంద కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరిపోయాడు. ఈ చిత్రం తర్వాత నాని ‘హాయ్ నాన్న’ అనే సాఫ్ట్ ఎమోషనల్ డ్రామా సినిమా చెయ్యడం తో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు.

Hi Nanna
Hi Nanna

ఇదేంటి నాని ఇలా పోతున్నాడు, ఒక పెద్ద సినిమా చేసిన తర్వాత చిన్న సినిమా చెయ్యడం ఏమిటి?, వెళ్తే ఒక్కటే లైన్ లో వెళ్ళాలి కదా, ఇలా పోతే ఆయన మార్కెట్ కి దెబ్బ కదా అని అనుకున్నారు. విడుదల తర్వాత మంచి రివ్యూస్ వచ్చాయి. ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ఊహించినట్టుగానే మొదటి రోజు ఈ చిత్రానికి చాలా తక్కువ ఓపెనింగ్ వచ్చింది. కనీసం మూడు కోట్ల రూపాయిల షేర్ కూడా రాలేదు.

సినిమా బాగున్నా కూడా కలెక్షన్స్ రావడం లేదు బ్యాడ్ లక్ అని ఈ ఓపెనింగ్స్ చూసి అందరూ అనుకున్నారు. కానీ పాజిటివ్ మౌత్ టాక్ వేరే లెవెల్ లో వెళ్లడం తో రెండవ రోజు నుండి వసూళ్లు బాగా పెరిగాయి. రెండవ రోజు దాదాపుగా మొదటి రోజుతో సమానంగా వసూళ్లు రాగ, మూడవ రోజు ఏకంగా నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడవ రోజు కలెక్షన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెరిగాయి కానీ, ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో మాత్రం మొదటి రోజు నుండే వసూళ్లు బాగున్నాయి. మొత్తం మీద మూడు రోజులకు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 28 కోట్ల రూపాయలకు జరిగింది, అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 13 కోట్లు రాబట్టాలి అన్నమాట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here