Prabhas-Anushka : మహేశ్ బాబుకు చెక్ పెట్టేందుకు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్న ప్రభాస్-అనుష్క
Prabhas-Anushka : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు పెద్దలు. అలా వయసులో ఉన్నప్పుడే జీవితానికి సరిపడా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. దాన్ని ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు తూ చా తప్పకుండా పాటిస్తుంటారు. ఇప్పటికే చాలామంది స్టార్లు పలు రకాల బిజినెస్‌లు చేస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో అగ్ర హీరోలు వ్యాపారాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే తాజాగా ప్రభాస్ కూడా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు-అల్లు అర్జున్ లాగా ఓ పెద్ద మాల్ ని హైదరాబాద్ కి తీసుకొస్తున్నాడట ప్రభాస్.

Prabhas-Anushka
Prabhas-Anushka

ఈ వ్యాపారంలో అనుష్క కూడా భాగస్వామ్యం కాబోతుందట. అనుష్క, ప్రభాస్ ఈ మాల్‌ను ఇప్పటి వరకు ఇండియాలో లేని అత్యాధునిక పరికరాలతో ఈ డిజైన్ చేయబోతున్నారు. ఈ మాల్ సక్సెస్ అయితే అల్లు అర్జున్, మహేష్ బాబు మాల్స్ పనికిరావని అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. మరోవైపు వీరి పెళ్లిని చూడాలని కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో.. అంటున్నారు. కానీ వాళ్లు ఆ విషయాన్ని పట్టించుకోకుండా..మిగతా వాటి గురించి మాత్రమే పట్టించుకుంటున్నారు.

Tags: