Sandeep Reddy : దానికోసం 36ఎకరాల మామిడి తోట అమ్ముకున్న సందీప్ రెడ్డి.. నీ కష్టానికి ఫలితం లభించిందా మరి.!

- Advertisement -


Sandeep Reddy : టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి. కొత్త వాళ్లు ఏళ్ల తరబడి నిర్మాతలు, దర్శకులు, హీరోలు అంటూ ఆఫీస్‌ల చుట్టూ తిరిగితే తప్పా అవకాశాలు రావు. అలా స్టార్ట్ డైరక్టర్ కావడానికి చాలా కష్టపడిన వారిలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. దర్శకుడిగా రాణిస్తాననే కాన్ఫిడెన్స్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సందీప్.. దర్శకుడిగా అర్జున్ రెడ్డి సినిమాను తానే నిర్మించాడు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.5 కోట్లు. జీవితంలో ఏదైనా సాధించాలంటే మనపై మనకు నమ్మకం ఉండాలి. లేకపోతే మనల్ని ఇతరులు నమ్మడం కూడా చాలా కష్టం. ఐతే సందీప్ రెడ్డికి తనపై ఉన్న నమ్మకమే ప్లస్ అయింది. ‘పెళ్లిచూపులు’తో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండకు అనుకున్న రేంజ్ లో ఇమేజ్ రాలేదు. అలాగే షాలినీ పాండే కూడా కొత్త హీరోయిన్ కావడంతో వీరిద్దరి రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ బడ్జెట్ లోనే ఉంది. అందులో ఎక్కువ భాగం మేకింగ్ కే ఖర్చు చేశారు. అర్జున్ రెడ్డి సినిమాకు సందీప్ నిర్మాతగా వ్యవహరించారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పెట్టుబడి కోసం సందీప్ రెడ్డి తన 36 ఎకరాల మామిడి తోటను విక్రయించాడు.

రూ.1.5 కోట్ల ఆస్తులను అమ్మి అర్జున్ రెడ్డి సినిమాను నిర్మించానని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వివరించాడు. అర్జున్ రెడ్డి ఫ్లాప్ అయి ఉంటే తన కుటుంబం రోడ్డున పడేదని ఆయన చెప్పకనే చెప్పాడు. సందీప్ రెడ్డి కుటుంబానికి చెందిన మామిడి తోటను తాకట్టు పెట్టి దర్శకుడిగా మారాడు. అతని నమ్మకానికి సక్సెస్ తోడైంది. దీంతో అర్జున్ రెడ్డి పెట్టుబడికి పదింతలు అంటే రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఓవర్ నైట్ స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్. అదే విధంగా అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా రీమిక్స్ చేసి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు సందీప్ రెడ్డి. దీంతో బాలీవుడ్‌లో సందీప్ మార్కెట్ పెరిగింది. తాజాగా యానిమల్ వరల్డ్ వైడ్ సెన్సేషన్ అయి సందీప్ రెడ్డి మార్క్ ప్రపంచవ్యాప్తంగా మరోసారి రుజువైంది. తాజాగా యానిమల్ 600 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. సందీప్ రెడ్డి యానిమల్ డైరెక్టర్ గానే కాకుండా ప్రొడక్షన్ పార్టనర్ గా కూడా వ్యవహరించారు. దీంతో ఆయనకు కోట్లలో లాభం వచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here