Actress Samantha : కేటీఆర్ పోస్ట్ పై సమంత రియాక్షన్.. కారణం ఏమిటంటే..?

- Advertisement -

నటి సమంత గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సమంత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. టాలీవుడ్ లో ఒక మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని సమంత కొంతకాలం నుండి సినిమాలకి దూరంగా ఉండి మళ్ళీ ఇప్పుడే ఫామ్ లోకి వస్తోంది. ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటోంది. ఫ్యాన్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది సోషల్ మీడియా వేదికగా ఇటీవల తెలంగాణ మాజీ ఐటి మినిస్టర్ కేటిఆర్ ఒక పోస్ట్ చేశారు కేటీఆర్ చేసినటువంటి పోస్ట్ కి సమంత వెంటనే రియాక్ట్ అయింది. ఆ పోస్టుకి కామెంట్ చేయడంతో పోస్ట్ వైరల్ అవుతోంది.

సమంత ఈ పోస్ట్ పై లైక్ చేస్తూ కామెంట్ చేయడంతో కేటీఆర్ చేసిన ఆ పోస్టులో ప్రత్యేకత ఏముంది అనే సందేహాలు వచ్చాయి కేటీఆర్ సైతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. రాజకీయ విషయాలని మాత్రమే కాకుండా ఇతర విషయాల గురించి కూడా ఆయన స్పందిస్తారు. తన చుట్టూ కొంతమంది ఉండగా మధ్యలో ఈయన నవ్వుతూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేసారు. ఈ ఫోటోని షేర్ చేసినటువంటి కేటీఆర్ జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టిన చిరునవ్వుతో ఎదుర్కోవాలి అని క్యాప్షన్ ఇచ్చారు.

- Advertisement -

ఈ పోస్ట్ చేసిన వెంటనే సమంత లైక్ కొట్టడమే కాకుండా నమస్తే అని ఉన్నటువంటి ఎమోజిని పెట్టింది. కేటీఆర్ చేసినటువంటి ఈ పోస్ట్ పై సమంత తొందరగా రియాక్ట్ అవడానికి కారణం లేకపోలేదు పరిస్థితులు ఎలా ఉన్నా చిరునవ్వుతో ఎదుర్కోవాలి అని ఆయన చేసిన పోస్ట్ సమంత జీవితానికి బాగా సూట్ అవుతుంది అందుకని ఆమె ఇలా రియాక్ట్ అయిందని అంతా అంటున్నారు. కేటీఆర్ చేసినటువంటి పోస్ట్ ఆమె వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉండడం వలన స్పందించిందని అంటున్నారు ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here