Tara Sutaria : పింక్ కలర్ లెహంగాలో తారా సుతారియా హొయలు

- Advertisement -

Tara sutaria తారా సుతారియా.. ఈ బాలీవుడ్ బ్యూటీ తన అందంతో, అభినయంతో ముంబయి ప్రేక్షకులను మైమరిపిస్తోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన హవా చూపిస్తోంది. ఎప్పుడూ ట్రెండింగ్ ఔట్ ఫిట్స్ లో కనిపించే ఈ బ్యూటీ ఈసారి ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో సందడి చేసింది. ప్రస్తుతం తారా ట్రెడిషనల్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఫొటోషూట్ లో తార.. పింక్ కలర్ లెహంగాలో కనిపించింది. ఈ లెహంగా డిజైన్ చూసి అమ్మాయిలూ ఆశ్చర్యపోతున్నారు. సూపర్ స్టైలిష్ గా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇక తార ధరించిన జ్యువెల్లరీకి కూడా అమ్మాయిలు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈ బ్యూటీ తన చేతికి పెట్టుకున్న రింగ్ చాలా స్టైలిష్ గా ఉందని అంటున్నారు.

Tara Sutaria in pink dress

మరోవైపు ఈ ఔట్ ఫిట్ లో తార క్లీవేజ్ షోతో రచ్చ చేసింది. ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తార అందం చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. ట్రెడిషనల్ లుక్ లోనూ తార హాట్ గా కనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. తార అందం చూసి కుర్రాళ్లు తనివితీరా మైమరిపోతున్నారు.

- Advertisement -
Tara Sutaria latest photos

ఇక తార సినిమా కెరీర్ గురించి మాట్లాడుకుంటే.. నెపోటిజమ్ తో నిండిపోయిన బాలీవుడ్ లో ఔట్ సైడర్ గా ఎంట్రీ ఇచ్చింది తారా సుతారియా. కరణ్ జోహర్ ప్రొడక్షన్ ధర్మ ప్రొడక్షన్ లో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ బీ టౌన్ లో సత్తా చాటుతోంది.

Tara Sutaria

మర్జావా, తడప్, హీరోపంతి-2, ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలతో బాలీవుడ్ లో తన సత్తా చాటింది. వీటిలో తడప్ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించి తన టాలెంట్ తో బీ టౌన్ ను మెస్మరైజ్ చేసింది. ఓవైపు సినిమాలు చేస్తూనే ఈ బ్యూటీ సింగింగ్ పై కూడా తన ఆసక్తిని చూపుతోంది. ఈ భామ పాటలు కూడా చాలా బాగా పాడుతోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం తన గాత్రం వినిపిస్తూ ఉంటుంది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here