Taapsee – Rashmika : బండ బూతులు తిట్టుకుంటున్న తాప్సీ, రష్మిక.. దుమ్మె్త్తిపోస్తున్న నెటిజన్లు

- Advertisement -


Taapsee – Rashmika : రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఛలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో నేషనల్ క్రష్ గా పాపులారిటీ సంపాదించుకుంది రష్మిక మందన్నా. ఈ మధ్య కాలంలో ఆమెపై ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. మరీ ముఖ్యంగా యానిమల్ సినిమాలో ఆమె బోల్డ్ పర్ఫామెన్స్ చూశాక జనాలు ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేయడం మొదలు చెప్పారు. డబ్బులిస్తే ఇలాంటి పనులు కూడా చేస్తావా.. అంటూ మండిపడ్డారు. చాలామంది సినీ ప్రముఖులు యానిమల్ సినిమాపై మండిపడడం గమనార్హం.

Taapsee - Rashmika
Taapsee – Rashmika

ఇది పరమ చెత్త సినిమా అంటూ ట్రోల్ చేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ సినిమానే 900 కోట్ల రూపాయలు క్రాస్ చేసింది. ఇటీవల ఈ సినిమాపై హీరోయిన్ తాప్సీ పరోక్షకంగా చేసిన కామెంట్స్ రష్మిక గూబ గుయ్యమనిపించిందంటున్నారు జనాలు. సినిమా ఇండస్ట్రీలో ఉండే నటులకు చాలా గౌరవం ఉంటుంది . ఆ గౌరవాన్ని మనం మన పద్ధతుల ద్వారా.. మనం చేసే సినిమాలు ద్వారా.. పాడు చేసుకోకూడదు.. మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం.. నచ్చింది చేసే రైట్ మనకు ఉంది.. ఒకరి ఆప్షన్స్ ని నేను తప్పు పట్టడం లేదు ..నేనైతే యానిమల్ సినిమాలో అవకాశం వస్తే చేసుండే దాన్ని కాదంటూ చెప్పుకొస్తున్నాను” అంటూ పరోక్షంగా రష్మిక మందన్నా చేసిన పనిని తాప్సీ తప్పు పట్టింది. దీంతో సోషల్ మీడియాలో ఇదే వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.

Taapsee Pannu

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో హీరోగా రణబీర్ కపూర్ హీరోయిన్ రష్మిక మందన్నా నటించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . రూ.900 కోట్లు కలెక్ట్ చేసింది. టాక్ ప్రకారం సూపర్ డూపర్ అయినా కూడా చాలామంది సినిమాలో బోల్డ్ కంటెంట్ చూసి షాక్ అయిపోయారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here