Manchu Manoj : ఆయన బూతులు మాట్లాడితే చెవుల్లోంచి రక్తం వస్తది.. మనోజ్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -


Manchu Manoj : తెలుగు చిత్రపరిశ్రమలో మంచు ఫ్యామిలీ గురించి పరిచయం అవసరం లేదు. ఆ ఇంటి హీరోల్లో కాస్తో కూస్తో మంచు మనోజ్‎కి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు హీరోగా చేసి కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ మంచు మనోజ్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. అంతేకాదు మరోవైపు ఉస్తాద్ అనే షోని కూడా హోస్ట్ చేస్తున్నారు. స్టార్ సెలబ్రిటీస్ తమ సినిమాల ప్రమోషన్స్ కోసం ఈ షో కి వస్తుంటారు. చాలా హెల్తీగా, జోవియల్ గా మంచు మనోజ్ వచ్చిన స్టార్స్ తో మాట్లాడుతుంటారు. ఇటీవల ఈ షో కి రవితేజ గెస్టుగా హాజరయ్యారు. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈగల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ మంచు మనోజ్ హోస్ట్ చేస్తున్న షో కి గెస్ట్ గా వచ్చారు. వీరిద్దరి మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి . ఇద్దరికి ఇద్దరే నాటి ఫెలోస్ చక్కగా అభిమానాలను ఎంటర్ టైన్ చేస్తారు. మరి ఇద్దరు ఒకే స్టేజిపై ఉంటే ఆ రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదే క్రమంలో రవితేజను కొన్ని ప్రశ్నలు అడిగాడు మంచు మనోజ్.

Manchu Manoj
Manchu Manoj

మంచు మనోజ్ మాట్లాడుతూ .. మనమిద్దరం మొదటిసారి ఎప్పుడు కలిశాం అన్నయ్య .. మీకు గుర్తుందా..?” అంటూ అడుగుతాడు . అప్పుడే రవితేజ ఆలోచిస్తూ ఉండగా.. నువ్వేమైనా ఫిగరా..? గుర్తుపెట్టుకోవడానికి అనుకుంటున్నారు కదా ..? అంటూ సెటైరికల్ గా పంచ్ వేస్తాడు. అనంతరం మరో ప్రశ్న అడుగుతూ .. ఇండస్ట్రీలో రవితేజ వాడే బీప్ లు ఇంకెవరు మాట్లాడరు అంటారు.. నిజమేనా అంటూ ప్రశ్నించాడు. అందుకు హీరో రవితేజ ఓపెన్ గా సమాధానం చెప్పారు . అందరూ బూతులు మాట్లాడుతారు .. కానీ నేను ఎక్కువగానే ఓపెన్ అయిపోతానంటూ తనదైన స్టైల్ లో ఆన్సర్ చేశాడు. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒకటైతే నిజం రవితేజ రియల్ గా కూడా బూతులు మాట్లాడితే చాలు చెవులు మూసుకోవాల్సిందే . అయితే ఆ విషయాన్ని ఆయనే ఓపెన్ గా చెప్పడం మరింత ట్రెండ్ అవుతుంది. మంచు మనోజ్ రవితేజల మధ్య ఫ్రెండ్షిప్ ఈ షో తో బాగా బయట పడిపోయింది. రవితేజ నటించిన ఈగల్ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here