Rashmika : ఆయన కోసం ఎదురు చూస్తున్నా.. వస్తే మాత్రం వదిలేదే లేదంటున్న రష్మిక మందన్నా

- Advertisement -


Rashmika : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ అయిపోయింది. ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా గడుపుతోంది. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల రష్మిక స్టార్ హీరో ర‌ణ్‌బీర్ కపూర్ తో కలిసి నటించిన సినిమా యానిమల్ పాన్ ఇండియా లెవెల్ లో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.

ఈ మూవీ తో ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెంచుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మందన్నా ఓ ఇంటర్వ్యూలో సంద‌డి చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ధనుష్ సరసన నటించేందుకు ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలియజేసింది.

ధనుష్ మంచి నటుడని.. తన పక్కన నటించడం వల్ల పలు విషయాలు నేర్చుకోవచ్చంటూ చెప్పుకొచ్చింది. ఇక ధనుష్‌తో నటించడానికి ఇది కూడా ముఖ్య కారణమని తెలిపిన ఈ ముద్దుగుమ్మ. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాను అంటూ వివరించింది. ఆయనతో నటించే రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు్న్నానని తెలిపింది. రష్మిక చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన నీకు ధనిష్‌తో నటించడం అంటే ఎందుకు అంత స్పెషల్ అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here