ఆదిపురుష్‌కు మొదటిరోజే రూ.100 కోట్ల వసూళ్లు..! ఈ షాకింగ్‌ విషయాలు తెలుసా!

- Advertisement -

బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆదిపురుష్’. భారతీయ పురాణ ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అగ్ర కథానాయకుడు ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా అనేక బాషల్లో రిలీజ్‌ కానున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అయితే ‘ఆదిపురుష్’ విడుదల నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.

ఆదిపురుష్‌
ఆదిపురుష్‌

‘ఆదిపురుష్’ విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబడుతుందని అంచనా. ఈ మేరకు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ ఓపెనింగ్స్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మేజర్ కంట్రిబ్యూషన్ లభించనుందని తెలుస్తుంది. ఇక హిందీ మార్కెట్ నుంచి రూ.10 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ‘ఆదిపురుష్’ అన్ని భారతీయ భాషల్లోనూ కలెక్షన్లలో మార్క్ చూపించగలదనే న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

కాస్టింగ్, అవతార్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్, రామాయణ గాథ కావడంతో.. ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లల నుంచి భారీ రెస్పాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇక ప్రభాస్‌ ఇమేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీటన్నింటి పరిణామాలతో ‘ఆదిపురుష్’ కలెక్షన్లు భారీగా ఉంటాయని అంచనా. ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించ ఓవర్‌సీస్ మార్కెట్ కూడా కీలకం కానుంది. ఇక్కడ ఓపెనింగ్స్ బాగుంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు రూ. 100 కోట్లు కలెక్ట్ చేయడం ఏమంత కష్టం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

ఆదిపురుష్’ తర్వాత ప్రభాస్ ఫోకస్‌ పాన్ ఇండియా చిత్రం ‘సలార్‌’ సినిమాపైనే ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత మారుతీతో మూవీలో నటిస్తారు. దీంతో పాటు వైజయంతీ బ్యానర్‌లోనే తెరకెక్కుతున్న ప్రాజెక్టు-కేను పూర్తి చేయనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో విడుదల కానుంది. వీటన్నింటి తర్వాత హను రాఘవపూడితో మూవీని పట్టాలెక్కించనున్నారు ప్రభాస్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here