Surekha Vani : వామ్మో ప్లేట్ ఫిరాయించిన సురేఖ వాణి.. రాజకీయాలనూ వాడుకుంటుందిగా..

- Advertisement -

Surekha Vani : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంగ్రాట్స్ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి చెందిన నేపథ్యంలో తెలంగాణలో విజయం రేవంత్ రెడ్డి విజయం అన్నారు. యువ హీరో నిఖిల్ సిద్ధార్థ కూడా రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ చెప్పారు. సుప్రీత సైతం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కాబోయే ముఖ్యమంత్రికి కంగ్రాట్స్ చెప్పారు. దీంతో ఆమెపై విమర్శలు వస్తున్నాయి.

SUrekha Vani
SUrekha Vani

ఎన్నికలకు ముందు కొంత మంది బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా వీడియోలు పోస్ట్ చేశారు. కెసిఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందిందని, ‘అంతకు ముందు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది’ అంటూ తమ తమ సోషల్ మీడియా అకౌంట్ వీడియోలు పోస్ట్ చేశారు. అదంతా ప్రచారంలో భాగం! ఆ ప్రచారం చేసిన ఇన్‌ఫ్లూయెన్సెర్లలో సుప్రీతా నాయుడు బండారు ఒకరు. గతంలో ఓ డ్రగ్స్ కేసులో సురేఖా వాణి పేరు వినిపించింది.

దాంతో తమకు సంబంధం లేదని ఆమె వివరించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తన సోషల్ మీడియా అకౌంటులో పోస్ట్ చేసిన వీడియోను సుప్రీత డిలీట్ చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ చెప్పారు. దాంతో ఆవిడ ప్లేట్ తిప్పేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బహుశా… ఈ కామెంట్స్ సుప్రీత దృష్టికి వచ్చాయేమో!? ‘మేం చూసిన బెస్ట్ ఐటీ మినిస్టర్ కేటీఆర్’ అని ఎవరో చేసిన పోస్టును తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు సుప్రీత. దాంతో ఆమె వ్యవహార శైలిపై నెటిజనులు విమర్శలు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here